Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశపరిచిన 'సలార్' టీమ్..!

By:  Tupaki Desk   |   25 May 2022 6:30 AM GMT
ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశపరిచిన సలార్ టీమ్..!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ''సలార్''. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెట్స్ మీద ఉంది. 'బాహుబలి' హీరో మరియు 'కేజీఎఫ్' ప్రాంఛైజీతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే 'సలార్' నుంచి వచ్చిన ప్రభాస్ మోస్ట్ వైలెంట్ ఫస్ట్ లుక్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో డార్లింగ్ ఊర మాస్ అవతార్ లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసాడు. అయితే అప్పటి నుంచి ఈ మూవీ నుంచి అధికారికంగా ఎలాంటి కంటెంట్ బయటకు రాలేదు.

అప్పుడప్పుడు సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తూ వచ్చాయి. ఇటీవల ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్ 2' సినిమా సంచలన విజయం సాధించడంతో.. 'సలార్' లో ప్రభాస్ మాస్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా వేచి చూస్తున్నారు.

కనీసం 'సలార్' టీజర్ వదిలి సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇవ్వాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలో టీజర్ ను మే నెలాఖరున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ కూడా అదే చెప్పారు. అయితే ఇప్పుడు మేకర్స్ ప్లాన్ మార్చుకున్నారని తెలుస్తోంది.

'సలార్' టీజర్ ను ఈ నెలలో విడుదల చేయడం లేదని.. త్వరలోనే ప్రత్యేకమైన తేదీకి టీజర్ ను వదులుతామని చిత్ర వర్గాలు తెలిపినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే జూన్ లేదా జూలైలో టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

'సలార్' టీజర్ రావడం లేదని తెలిసి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. డార్లింగ్ మరియు దర్శక నిర్మాతలు తమ మాటలను నిలబెట్టుకోకపోవడం చాలా బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అది ఎప్పుడు వచ్చినా నెట్టింట సరికొత్త రికార్డులు పెట్టడం ఖాయమని అంటున్నారు.

ఇకపోతే 'సలార్' చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేసేలా తాజాగా నిర్మాత విజయ్ 'సలార్' సినిమా గురించి తాజాగా ఓ మీడియాతో మాట్లాడారు.

''మేము 'సలార్' కోసం చాలా పెద్ద లక్ష్యాన్ని సెట్ చేసాము. ఒకవైపు భారతదేశపు నంబర్ వన్ సినిమా 'బాహుబలి 2' హీరో అయిన ప్రభాస్ మరియు మరోవైపు భారతదేశపు రెండవ అతిపెద్ద చిత్రం 'KGF 2' తీసిన ప్రశాంత్ నీల్ మరియు హోంబాలే ఉన్నాయి. ఇది సంచలనం సృష్టించిన కాంబినేషన్. అతి పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తాము'' అని నిర్మాత పేర్కొన్నారు.

కాగా, ''సలార్'' చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ - విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే 'సలార్' సినిమాకు సంబంధించి 30-35% షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి.. 2023 సమ్మర్ సీజన్ లో సినిమాని విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ధృవీకరించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.