Begin typing your search above and press return to search.

'స‌లార్' రిలీజ్ వాయిదా? అవ‌న్నీ పుకార్లు!

By:  Tupaki Desk   |   23 Jan 2023 1:00 PM GMT
స‌లార్ రిలీజ్ వాయిదా? అవ‌న్నీ పుకార్లు!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయ‌కుడిగా కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్త‌న్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సలార్'. ఈ సినిమా ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ జాబితాలో ట్రెండింగులో ఉంది. షూటింగ్ ప్రధాన భాగం హైదరాబాద్ స‌హా ప‌లు అరుదైన లొకేష‌న్ల‌లో భారీ సెట్ల‌లో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ చిత్రం యాక్షన్ మునుపెన్న‌డూ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో లేనంత కొత్త‌గా ఉంటుంద‌న్న చ‌ర్చా సాగుతోంది. ప్రశాంత్ నీల్ సలార్ క్లైమాక్స్ ఫైట్ తో పాటు సినిమాలో ఆరు భారీ యాక్షన్ ఎపిసోడ్ లను ప్లాన్ చేశార‌ని క‌థ‌నాలొచ్చాయి.

KGF రెండు భాగాలకు పనిచేసిన స్టంట్ మాస్టర్స్ ఇప్ప‌టికే కొన్ని యాక్షన్ ఎపిసోడ్ లను రూపొందించారు. గోదావరిఖనిలో ఓ యాక్షన్‌ ఎపిసోడ్ ను కూడా తెర‌కెక్కించారు. ఇటీవ‌ల‌ ప‌తాక‌స‌న్నివేశంలో భారీ యాక్ష‌న్ దృశ్యాల కోసం పాపుల‌ర్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ ని బ‌రిలో దించార‌ని క‌థ‌నాలొచ్చాయి. అత‌డి చేరిక‌తో స‌లార్ యాక్ష‌న్ మ‌రో లెవ‌ల్ ని ట‌చ్ చేస్తుంద‌ని సినిమాకి ఈ దృశ్యాలు మ‌రో హైలైట్ గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు.

అలాగే శ్రుతిహాస‌న్ పాత్ర ఇందులో ఎంతో ట్రాజిక్ గా ఎంతో ఎమోషన్ ని రగిలిస్తుంద‌ని కూడా చెబుతున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ దాదాపు 400 కోట్లు పైగా బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేస్తోందని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి.

ఇక ఈ సినిమాతో ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పాన్ వ‌ర‌ల్డ్ కి రీచ్ అవ్వాల‌న్న‌ది కేజీఎఫ్ దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ పంతం. దీంతో ప్రభాస్ మాస్ కటౌట్ ని ఒక రేంజులో ఉపయోగించుకున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో రాఖీ భాయ్ (కేజీఎఫ్ య‌ష్‌) ని మించిన క‌రిష్మాతో ప్ర‌భాస్ అల‌రించ‌బోతున్నాడు. ఈ చిత్రంలో నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 28 సెప్టెంబర్ 2023న అత్యంత భారీగా స‌లార్ విడుదల కానుంది.

ఈ ప్ర‌చారంలో నిజ‌మెంత‌?అయితే స‌లార్ చిత్రం 2023 లో విడుద‌లయ్యేందుకు ఛాన్స్ లేద‌ని 2024 కి వాయిదా ప‌డింద‌ని ఒక సెక్ష‌న్ మీడియా విప‌రీతంగా ప్ర‌చారం చేస్తోంది. వాయిదా ప‌డుతోందంటూ తెలుగు మీడియాల ప్రచారంతో హిందీ మీడియాలు దీనిని వైర‌ల్ చేశాయి. అయితే ఇది నిజ‌మా? అంటే.. వార్త‌ను నిర్మాణ సంస్థ‌తో అధికారికంగా క‌న్ఫామ్ చేసుకోక‌పోవ‌డంతో వ‌చ్చిన ముప్పు అని తాజాగా తెలిసింది. స‌లార్ వాయిదా వార్త‌ల్లో నిజం లేదు. ఆ మేర‌కు ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఇన్ సైడ్ సోర్స్ వాస్త‌వాల‌ను వెల్ల‌డించింది. 2023 సెప్టెంబ‌ర్ 28న య‌థాత‌థంగా స‌లార్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. ఆ మేర‌కు సైమ‌ల్టేనియ‌స్ గా నిర్మాణానంత‌ర ప‌నుల్ని సాగిస్తున్నార‌ని తెలిసింది.

ప్ర‌భాస్ నుంచి రెండు రిలీజ్ లు ప‌క్కా 2023లో ప్ర‌భాస్ న‌టించిన రెండు సినిమాలు ప‌క్కాగా రిలీజ్ కాబోతున్నాయి. ఆదిపురుష్ జూన్‌ 16న విడుద‌ల కానుండ‌గా.. సలార్‌ సెప్టెంబరు 28న రిలీజ్ ఖాయం అంటూ ఇప్పటికే విడుదల తేదీలను చిత్ర‌బృందాలు ఖాయం చేసాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ ఈ నెల 17న ఆదిపురుష్ 3డి టీమ్ మ‌రో 150 రోజుల్లో సినిమా రాబోతోందని ప్రకటించింది. శనివారం (21జ‌న‌వ‌రి) నాడు సలార్‌ బృందం కూడా మరో 250 రోజుల్లో సినిమా విడుదల కానుందని అధికారికంగా తెలిపింది. అంటే సెప్టెంబ‌ర్ 28 డేట్ కే వ‌స్తున్నామ‌ని అధికారికంగా టీమ్ వెల్ల‌డించింది. స‌లార్ పెండింగ్ షూటింగు తో పాటు.. సైమ‌ల్టేనియ‌స్ గా నిర్మాణానంత‌ర ప‌నుల్ని పూర్తి చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.