Begin typing your search above and press return to search.

'సలార్' గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!

By:  Tupaki Desk   |   14 May 2022 10:31 AM GMT
సలార్ గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సలార్''. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు. 'బాహుబలి' హీరో - 'కేజీఎఫ్' డైరెక్టర్ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'సలార్' నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ మాస్ ఫస్ట్ లుక్ డార్లింగ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. 'ది మోస్ట్ వైలెంట్ మెన్.. కాల్డ్ వన్ మ్యాన్.. ది మోస్ట్ వైలెంట్' అంటూ ప్రభాస్ ను సరికొత్త అవతార్ లో చూపించి సర్ప్రైజ్ చేసాడు నీల్.

అలానే షూటింగ్ లోకేషన్స్ నుంచి లీకైన ఫోటోల్లో ప్రభాస్ ను చూసి అభిమానులు ఖుషీ అయ్యారు. అయితే 'కేజీయఫ్ 2' విడుదలై బ్లాక్ బస్టర్ ఆయిన్ తర్వాత కూడా ''సలార్'' కు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో వారు కాస్త నిరాశ చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో 'సలార్' నిర్మాత విజయ్ కిరగందూర్ సాలిడ్ అప్డేట్ తో వచ్చారు. షూటింగ్ కు సంబంధించిన వివరాలతో పాటుగా రిలీజ్ ను కూడా కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే 30-35% షూటింగ్ పూర్తయిందని.. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుందని తెలిపారు.

ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తామని.. 2023 సమ్మర్ సీజన్ లో సినిమాని విడుదల చేస్తామని నిర్మాత ధృవీకరించారు. వచ్చే సంక్రాంతి పండక్కి 'ఆదిపురుష్' మూవీ రిలీజ్ అవుతుండగా.. ఇప్పుడు వేసవిలో ప్రభాస్ నుంచి మరో మూవీ రానుందని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి 'సలార్' చిత్రాన్ని 2022 ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతేడాది ప్రకటించారు. అయితే కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్లాన్స్ అన్నీ తారుమారు అవ్వడంతో.. ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' చిత్రాన్ని అదే తేదీకి రిలీజ్ చేశారు నిర్మాతలు.

'కేజీయఫ్ 2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తున్న నేపథ్యంలో.. రాబోయే ''సలార్'' చిత్రంతో ఆ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. 'సాహో' 'రాధేశ్యామ్' చిత్రాలతో నిరాశపరిచిన ప్రభాస్.. ఈసారి చాలా గట్టిగా కొడతారని నమ్ముతున్నారు.

''సలార్'' చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు - పృథ్వీరాజ్ సుకుమారన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది.