Begin typing your search above and press return to search.

సినీ కార్మికులకు అండగా 'సలార్' మేకర్స్.. ఆక్సిజన్‌ ప్లాంట్‌ తో పాటు ఆర్థిక సాయం..!

By:  Tupaki Desk   |   8 Jun 2021 3:30 PM GMT
సినీ కార్మికులకు అండగా సలార్ మేకర్స్.. ఆక్సిజన్‌ ప్లాంట్‌ తో పాటు ఆర్థిక సాయం..!
X
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. ఫస్ట్‌ వేవ్‌ ప్రభావం నుంచి బయటపడటానికి గట్టిగా ప్రయత్నిస్తున్న సమయంలో కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చి దెబ్బ కొట్టింది. లాక్‌ డౌన్‌ విధించడంతో థియేటర్స్ క్లోజ్ అయ్యాయి.. సినిమా షూటింగులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చిత్ర పరిశ్రమ మొత్తం స్తంభించిపోవడంతో సినిమాను నమ్ముకున్న 24 క్రాఫ్ట్స్ కి చెందిన సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకోడానికి ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో ''సలార్'' చిత్రాన్ని నిర్మిస్తున్న హోంబలే నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది.

కరోనా విపత్కర పరిస్థితుల్లో హోంబలే నిర్మాణ సంస్థ కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో 2 ఆక్సిజన్‌ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 20 బెడ్స్ ని అందుబాటులోకి తెచ్చి అత్యవసరం ఉన్న వారికి ఈ ప్లాంట్‌ ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. అంతేకాకుండా 'హోంబలే' నిర్మిస్తున్న ''సలార్‌'' చిత్ర యూనిట్ లోని 150 మందికి ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ లోని వివిధ శాఖ‌లకు చెందిన 3200 మందికి రూ.35 లక్షలు విరాళంగా ప్రకటించింది. కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన హోంబలే నిర్మాణ సంస్థ.. ఇప్పుడు సెకండ్ వేవ్ పరిస్థితుల్లోనూ హెల్పింగ్ హ్యాండ్ గా నిలిచింది.