Begin typing your search above and press return to search.

ఫైనల్ స్టేజ్ లో సలార్... ఇక పునాకలే!

By:  Tupaki Desk   |   7 Feb 2023 4:08 PM GMT
ఫైనల్ స్టేజ్ లో సలార్... ఇక పునాకలే!
X
బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్ర‌భాస్‌.. వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల‌నే చేస్తూ వ‌స్తున్నారు. ఇటు ద‌క్షిణాదిన అటు బాలీవుడ్‌లోనూ అంద‌రి చూపు యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ సినిమాల‌పైనే ఉందనే చెప్పాలి. ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ ఆశించినా స్థాయిలో ఆకట్టుకోలేదు.. ఇక ప్ర‌భాస్ నెక్స్ట్ మూవీస్ కోసం ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. ప్ర‌భాస్ సాలిడ్‌ గా కొడితే బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌టం ఖాయమనే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ప్ర‌భాస్ లిస్టులో ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో 'స‌లార్' ఒక‌టి. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల నెలకొన్నాయి. అందుకు కార‌ణం.. ప్ర‌భాస్ ఒక‌టైతే.. మ‌రో కార‌ణం డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌. కె.జి.య‌ఫ్ చిత్రంతో రీసెంట్‌ గా ఇండియ‌న్ సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌ను షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే.

వీరిద్ద‌రి కాంబోలో రాబోతున్న 'సలార్' సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి రెండు, మూడు పోస్ట‌ర్స్ త‌ప్ప మ‌రే అప్‌డేట్స్ ఇప్పటి వరకు లేవు.

తాజా సమాచారం మేర‌కు ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈ నెల చివరి వరకు పూర్తి కానుంది అని సమాచారం.. ఈ సినిమా ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి అయితే ఇక... అన్ని పనులు పూర్తి చేసుకుని... సెప్టెంబర్ 28 న రిలీజ్ చేయనున్నారు. ఇక స‌లార్ టీజ‌ర్‌ను ఏప్రిల్ 2 విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు.

ఒక‌వేళ అదే నిజ‌మైతే మాత్రం ప్ర‌భాస్ మాస్ యాక్ష‌న్‌ను ప్ర‌శాంత్ నీల్ నెక్ట్స్ రేంజ్‌లో చూపిస్తాడ‌న‌టంలో సందేహం లేదు. స‌లార్ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో సినిమా రూపొందుతోంది.

ఇది కాకుండా మరో వైపు ప్రభాస్ ప్రాజెక్ట్ K అనే సినిమా చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. మరో వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. వీటితో పాటు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చర్చల దశలో ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.