'సలార్' ఆ ఒక్క ఫైట్ సీన్ అద్బుతం

Mon Jan 17 2022 11:47:54 GMT+0530 (IST)

Salaar Movie Shooting Update

ప్రభాస్ హీరోగా వరుస చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే రాధే శ్యామ్ విడుదలకు సిద్దంగా ఉంది. సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల వాయిదా పడ్డ విషయం తెల్సిందే. మార్చి లో రాధేశ్యామ్ సినిమా విడుదల అవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. రాధేశ్యామ్ విడుదల విషయమై క్లారిటీ రాకుండానే ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ ముగించారు. సలార్ సినిమా చిత్రీకరణ దాదాపుగా సగం వరకు పూర్తి అయ్యింది. అతి త్వరలోనే సలార్ సినిమా బ్యాలన్స్ షూట్ ను ముగించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ తో హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా సలార్ ను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.కేజీఎఫ్ కంటే కేజీఎఫ్ 2 ను మరింత భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమాను రూపొందించాడు. ఇప్పుడు సలార్ ను కేజీఎఫ్ 2 కు మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ కు ఏమాత్రం తగ్గకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని మేకర్స్ అంటున్నారు. సలార్ లో అత్యంత హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడట. ముఖ్యంగా ఈ సినిమాలోని ప్రీ క్లైమాక్స్ లో వచ్చే 6 నుండి 7 నిమిషాల యాక్షన్ సన్నివేశం అద్బుతంగా ఉండబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలోని ఆ యాక్షన్ సన్నివేశం కోసమే ఏకంగా రూ.20 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

హాలీవుడ్ టెక్నాలజీతో పాటు హాలీవుడ్ టెక్నికల్ టీమ్ ను ఈ యాక్షన్ సన్నివేశం కోసం తీసుకు రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా రూపొందించిన ఈ కథను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మళ్లీ ప్రారంభించేందుకు గాను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ సినిమా లో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆమె పాత్ర సినిమాకు అత్యంత కీలకంగా చెబుతున్నారు. ఆమె పాత్ర నెగటివ్ ఎండ్ ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. షూటింగ్ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ఏడాది సంక్రాంతికే సినిమా వచ్చి ఉండేది. కాని ఇప్పుడు సినిమా విడుదల తేదీ విషయమై స్పష్టత లేకుండా పోయింది. ఎప్పటికి సినిమా విడుదల అవుతుందో చూడాలి.