Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పూరి చూస్తే ఊరుకోడ‌మ్మోవ్!

By:  Tupaki Desk   |   28 March 2020 3:11 PM GMT
ఫోటో స్టోరి: పూరి చూస్తే ఊరుకోడ‌మ్మోవ్!
X
సోష‌ల్ మీడియాల్లో అందాల క‌థానాయిక‌ల స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ముంబై టు దిల్లీ టాప్ మోడ‌ల్స్ ఇటు టాలీవుడ్ లో కి దిగిపోయేందుకు దారులు వెతుకుతూ సామాజిక మాధ్య‌మాల్లో వేడెక్కించే ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఆ కోవ‌లోనే ఇదిగో ఈ అమ్మ‌డు కూడా వీరంగం వేస్తోంది. ఇంత‌కీ ఎవ‌రీవిడ‌? అంటే టిక్ టాక్.. ఇన్ స్టాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ భామ పేరు సాక్షి ద్వివేది.


ఈ అమ్మ‌డి స్వ‌స్థ‌లం న్యూఢిల్లీ. 27 జూలై పుట్టిన‌రోజు. నటి.. మోడల్ .. టిక్ టోక్ స్టార్ గా పాపుల‌రైంది. అటు బాలీవుడ్ స‌హా పంజాబీ సినిమాల్లో న‌టించి పేరు తెచ్చుకుంది. ఇక మోడలింగ్ వృత్తిలో రాణించేందుకు చాలా కాలం క్రిత‌మే సాక్షి ద్వివేది ముంబైకి మకాం మార్చింది. అవీ జె స్ గుడ్ నైట్ పేరుతో పంజాబీ మ్యూజిక్ వీడియోలో కనిపించాక త‌న పేరు వెలుగులోకి వచ్చింది. 2017 లో బాలీవుడ్ చిత్రం `భూమి`లో సహాయక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో సంజయ్ దత్ - అదిథీ రావు హైదారితో కలిసి ఆమె నటించింది.

నటనతో పాటు.. సోషల్ మీడియా స్టార్ గా సాక్షి పాపుల‌రైంది. సాక్షి ద్వివేది ఇన్ స్టా ఫోటోలు నిరంత‌రం ఓ రేంజులో ట్రీటిస్తున్నాయి. త‌న‌ టిక్ టాక్ ఖాతా (@ sakshi.dwivedii)ను దాదాపు 10ల‌క్ష‌ల (1 మిలియన్) మంది అనుస‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌లు ఉత్త‌రాది చిత్రాల్లో న‌టిస్తోంది. ఇరుగు పొరుగు భాష‌ల్లో అందునా సౌత్ లో రాణించే ప్ర‌య‌త్నాల్లో ఉందిట‌. అయితే ఇంత‌గా వేడెక్కించే సొగ‌సు క‌నిపిస్తే పూరి.. కొర‌టాల‌.. సుకుమార్ లాంటి స్టార్లు అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తారు. క‌నీసం ఐటెమ్ నంబ‌ర్ లో ఛాన్సొచ్చినా ఈ అమ్మ‌డు స‌ద్వినియోగం చేసుకుంటుందేమో.