Begin typing your search above and press return to search.

పుష్ప 2 లో ఇండియన్‌ హాలీవుడ్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   4 Dec 2022 11:30 PM GMT
పుష్ప 2 లో ఇండియన్‌ హాలీవుడ్‌ స్టార్‌
X
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ కాంబోలో రూపొందబోతున్న పుష్ప 2 సినిమా యొక్క అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోతూనే ఉన్నాయి. హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించబోతుంది.. ఇంకా కొన్ని పాత్రల్లో మొదటి పార్ట్‌ లో కనిపించిన నటీ నటులు కనిపించబోతున్నారు. అయితే కొన్ని కొత్త పాత్రలను క్రియేట్‌ చేసి వాటికి పాన్ ఇండియా టచ్ ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

పుష్ప 2 సినిమాలో కొత్తగా నటించబోతున్న నటీ నటుల గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎంతో మంది పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. తాజాగా సజ్జాద్ డెలాఫ్రూజ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈయన పుష్ప 2 లో విలన్ గా నటించబోతున్నాడని.. ఈయన సినిమాలో ఉండటం వల్ల కచ్చితంగా బాలీవుడ్‌ లో మరింత బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ సల్మాన్ ఖాన్ మూవీ టైగర్ జిందా సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన సజ్జాద్ డెలాఫ్రూజ్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి బాలీవుడ్‌ లో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇండియన్ అయినా కూడా యూఏఈ లో పెరిగిన సజ్జాద్ డెలాఫ్రూజ్ పలు హాలీవుడ్‌ సినిమాల్లో నటించాడు.

హాలీవుడ్ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి గుర్తింపు దక్కించుకున్న సజ్జాద్ డెలాఫ్రూజ్ ఇప్పుడు బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ స్టార్‌ గా నిలిచాడు. ఆ స్టార్‌ కాస్త ఇప్పుడు తెలుగు సినిమా పుష్ప 2 లో నటించేందుకు సిద్ధం అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి.

సుకుమార్‌ ఆయన్ను పుష్ప 2 లో నటింపజేసేందుకు కాస్త ఎక్కువగానే కష్టపడ్డారు అనేది టాక్‌. భారీ పారితోషికం ఆఫర్‌ చేయడం తో పుష్ప 2 లో సజ్జాద్ డెలాఫ్రూజ్ నటించేందుకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

భారీ అంచనాల నడుమ పుష్ప 2 ఇటీవలే ప్రారంభం అయ్యింది. పుష్ప ప్రమోషన్ కోసం రష్యా లో ఉన్న యూనిట్‌ సభ్యులు ఇండియాకు వచ్చిన వెంటనే పుష్ప 2 ను మళ్లీ ప్రారంభిస్తారట.