సాయితేజ్ అపాయింట్ మెంట్ రోజుకి ఇద్దరికే

Wed Oct 27 2021 12:54:51 GMT+0530 (IST)

Saitej Appointment Is For Two Per Day

మెగా మేనల్లుడు సాయితేజ్ యాక్సిడెంట్ అనంతరం సుదీర్ఘ కాలం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పటికే అతడు కోలుకున్నాడు. నిన్నగాక మొన్న దర్శకుడు హరీష్ శంకర్ నేరుగా సాయి తేజ్ రీలోడెడ్ అంటూ.. అతడి ఎనర్జీ గురించి కోలుకుంటున్న వైనం గురించి  సోషల్ మీడియాల్లో వెల్లడించి అభిమానులకు ధైర్యం చెప్పారు.  అటుపై సాయి సన్నిహితులు..స్నేహితులు..టాలీవుడ్ ఫ్రెండ్స్ అంతా ఆయన్ని పరామర్శించడానికి  ఒక్కొక్కరుగా ఇంటికి వెళుతున్నారు. సాయితేజ్ తో కాసేపు మాట్లాడి ఆరోగ్యంపై పరామర్శించి త్వరగా కోలుకుని మునిపటిలా సినిమాలు చేయాలని మనోధైర్యాన్ని ఇస్తున్నారు.సాయి తేజ్ రోజురోజుకు మెరుగవుతున్నాడు. గాయాలు మానుతున్నాయి. లేచి కూర్చుంటున్నాడు. మేజర్ గా జరిగిన ప్యాక్చర్స్ కూడా తగ్గుతున్నాయి. అయితే ఫిజిక్ మాత్రం బాగా తగ్గిపోయిందిట. బాగా సన్నబడిపోయాడని అంటున్నారు. సినిమాల్లోకి వచ్చిన  కొత్తలో ఎంత సన్నగా ఉండేవాడో ..అంత సన్నగా మారిపోయాడని  మాట్లాడుకుటున్నారు. ప్రమాదం కారణంగానే సాయితేజ్ శరీరంలో ఇన్ని మార్పులొచ్చినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ కి ముందు సాయితేజ్ బాగా బొద్దుగా తయారైన సంగతి తెలిసిందే. బాగా ఒళ్లు చేయడంతో డైటింగ్ మొదలు పెట్టాడు. సన్నబడటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నాడు. అయితే ఇంతలోనే యాక్సిడెంట్ మొత్తం మార్చేసింది. ప్రమాదం పెద్దగా జరగడంతో కోమాలోకి వెళ్లిపోవడం.. కొన్ని రోజుల పాటు అదే స్థితిలో ఉండటంతో శరీరానికి కావాల్సిన పోషకాలు ఏవీ అందలేదు.

కేవలం లిక్విడ్స్ తప్ప ఇతర పదార్ధాలేవి అతని శరీరానికి చేరలేదు. దీంతో బాడీలో ఒక్కసారిగా మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సాయితేజ్ ముఖానికి సంబంధించిన ఫోటోలు కూడా ఎక్కడా లీక్ అవ్వకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే విశ్రాంతి సమయంలో కేవలం రోజుకి ఇద్దరిని మాత్రమే కలుస్తున్నారు. సాయంత్ర వేళ్లలో ఆ ఇద్దరితో కాసేపు మాట్లాడి మళ్లీ విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డాక్టర్లు ఎక్కువగా విశ్రాంతి అవసరం అని సూచించడంతోనే ఎక్కువ సమయాన్ని పడుకోవడానికి కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సాయితేజ్ నటించిన `రిపబ్లిక్` ఇటీవల రిలీజైంది. ఇందులో సీరియస్ రోల్ చేసినా ఆకట్టుకున్నాడన్న టాక్ వినిపించింది. సినిమా యవరేజ్ గా ఆడింది. నవంబర్ నుండి ఇంకా పేరు పెట్టని అతీంద్రియ ఫాంటసీ థ్రిల్లర్ షూటింగును సాయి తిరిగి ప్రారంభిస్తారని కథనాలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని సుకుమార్ - బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.