Begin typing your search above and press return to search.

శైలేష్ సైంధవ్.. హిట్ కన్నా ముందే ప్లాన్..!

By:  Tupaki Desk   |   29 Jan 2023 7:00 AM GMT
శైలేష్ సైంధవ్.. హిట్ కన్నా ముందే ప్లాన్..!
X
విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ ఫేమ్ శైలేష్ కొలను సైంధవ్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. హిట్ 1, 2 సినిమాలతో డైరెక్టర్ గా తన సత్తా ఏంటో చూపించిన శైలేష్ ఈసారి సీనియర్ హీరో వెంకటేష్ తో ఒక యాక్షన్ మూవీ ప్లాన్ చేశాడు.

ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది రుచి చూపిస్తూ వదిలిన ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. శైలేష్ సైంధవ్ భారీ యాక్షన్ మూవీగా వస్తుంది. హిట్ సీక్వెల్స్ చేస్తున్న శైలేష్ ఈ కథ ఎప్పుడు రాసుకున్నాడో అన్న డౌట్ రాకమానదు. హిట్ ఏడెనిమిది సీక్వెల్స్ ప్లాన్ చేసుకున్న శైలేష్ సైంధవ్ స్టోరీ ఎలా సిద్ధం చేశాడో అనుకుంటున్నారు.

అయితే ఇక్కడ విషయం ఏంటంటే హిట్ కథలు రాసుకోకముందే శైలేష్ కి ఈ సైంధవ్ కథ ఆలోచనలో ఉందట. ఓ స్టార్ హీరోతో అది కూడా వెంకటేష్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందనే ఉద్దేశంతో సైంధవ్ కథ రాసుకున్నాడట.

అయితే వెంకీతో ఆ సినిమా చేయాలంటే తాను ముందు డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి అందుకే హిట్ 1, 2 రెండు సినిమాలు చేశాడు శైలేష్. నాని నిర్మాతగా చేసిన హిట్ రెండు సినిమాలు హిట్ అందుకున్నాయి. హిట్ 2 చివర్లో హిట్ 3 హింట్ కూడా ఇచ్చాడు. హిట్ 3 లో నానినే నటిస్తున్నాడు.

హిట్ 3కి కొద్దిగా టైం తీసుకోవాలని అనుకున్న శైలేష్ ఈలోగా వెంకటేష్ తో సైంధవ్ సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ టీజర్ తోనే సైంధవ్ రేంజ్ ఎలా ఉండబోతుంది అన్నది శాంపిల్ చూపించాడు. కచ్చితంగా వెంకటేష్ కెరీర్ లో ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెప్పొచ్చు. మామూలుగా ఎంటర్టైనర్ సినిమాలు చేసే వెంకటేష్ సీరియస్ రోల్స్ చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

అది కూడా హిట్ సినిమాలు తీసిన శైలేష్ లాంటి డైరెక్టర్ వెంకీ మామని ఎలా చూపిస్తాడో అని ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. తప్పకుండా శైలేష్ కొలను తనకు వచ్చిన ఈ బిగ్ ఛాన్స్ ని అన్నివిధాలుగా వాడుకుంటాడని చెప్పొచ్చు. శైలేష్ చేస్తున్న సినిమాలు స్పెషల్ గా ఉంటున్నాయి కాబట్టి వెంకటేష్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.