Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్‌: చాంపియ‌న్ `సైనా నెహ్వాల్` వ్వావ్ అంటారు

By:  Tupaki Desk   |   5 March 2021 4:13 AM GMT
టీజ‌ర్ టాక్‌: చాంపియ‌న్ `సైనా నెహ్వాల్` వ్వావ్ అంటారు
X
బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ పై బయోపిక్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. సైనా అనేది టైటిల్. పరిణీతి చోప్రా టైటిల్ పాత్ర‌ను పోషిస్తున్నారు. అమోల్ గుప్తే ద‌ర్శ‌కుడు.

తాజాగా ఈ మూవీ టీజ‌ర్ రిలీజైంది. ఒక్క టీజ‌ర్ తో ఉద్విగ్న‌త‌ను పెంచింది టీమ్. సిస‌లైన చాంపియ‌న్ అంటే ఇలా ఉండాలి! అన్నంత ఉత్కంఠ‌గా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ జీవిత‌క‌థ‌ను ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించార‌‌ని టీజ‌ర్ చెబుతోంది.

ఇక ప‌రిణీతిని అచ్చు గుద్దిన‌ట్టు సైనాయే అనేంత‌గా.. రాకెట్ ప‌ట్టి విజృంభించే చాంపియ‌న్ హావ‌భావాలు.. ఎమోష‌న్ .. ఒత్తిళ్లు ఇలా ప్ర‌తిదీ అందంగా తెర‌పై ఆవిష్క‌రిస్తున్నార‌ని టీజ‌ర్ చెబుతోంది. భారతదేశపు అత్యుత్తమ బ్యాడ్మింటన్ స్టార్ల‌లో ఒకరిగా ఎదగడానికి సైనా నెహ్వాల్ ఎంతగా శ్ర‌మించారో తెరపై చూపిస్తున్నారు. సైనా తన బాల్యంలోని ఇతర అమ్మాయిల మాదిరిగా కాకుండా వేరే మార్గాన్ని ఎలా ఎంచుకున్నారో ఈ టీజర్ లో వెల్ల‌డించారు. పరిణీతి వాయిస్ ఓవర్ ‌తో బ్యాడ్మింటన్ కోర్టు లో షాట్ ‌తో వీడియో మొదలవుతుంది.

``మేరా దేశ్ భారత్,.. ఆబాది సదా సౌ కోటి.. ఉస్మే సే ఆది లడ్కియా... రాజా బీటా కాలేజీ పడేగా మేరా,.. బేటి చుల్హా ఫ్యూక్ ఫినిష్.. అన్న డైలాగ్ తో ఉత్కంఠ పెంచారు. సైనా బ్యాడ్మింటన్ కోర్టులోకి ప్రవేశించే స్టైల్.. ఆమె కోచ్ తో కలిసి ప్రాక్టీస్ చేయడం.. ఒలింపిక్ పతకం అందుకోవ‌డం.. కామన్వెల్త్ క్రీడలలో ఐదు పతకాలు గెలుచుకోవడం.. `ప్రపంచ నంబర్ 1` గా నిలిచిన ఏకైక భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా గుర్తింపు ద‌క్కించుకోవ‌డం ప్ర‌తిదీ ఈ చిన్న టీజ‌ర్ లోనే చూపించారు.

విజేత‌గా సైనా ప్రేక్షకుల వైపు గ‌ర్వంగా త‌లెత్తి చూస్తూ.. భారతీయ జెండాను ఆమె భుజాలపై వేసుకుని ఉద్విగ్న‌త‌ను ప్ర‌ద‌ర్శించే తీరు ఆక‌ట్టుకుంటుంది. మేక‌ప్ ప‌రంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఆక‌ర్షిస్తోంది. సైనా బుగ్గ‌పై కుంకుడుకాయంత ఆ పుట్టుమ‌చ్చ .. పెద‌వి అంచుపై చిన్న మ‌చ్చ ప్ర‌తిదీ మేకప్ లో కేర్ తీసుకున్నారు.

తాజాగా పరిణీతి చోప్రా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం మార్చి 26 న థియేటర్లలో విడుదల కానుంది. భూషణ్ కుమార్- క్రిషన్ కుమార్- సుజయ్ జైరాజ్- రాసేష్ షా నిర్మించారు.