అడివి శేష్ క్రేజ్ తో అయినా పర్ ఫెక్ట్ హిట్ ఇస్తాడా?

Tue Nov 29 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

Sailesh Kolanu hit 2 movie news

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన మర్డర్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ `హిట్ : ద ఫస్ట్ కేస్`. హీరో నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ ద్వారా శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇంటెన్స్ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరి థ్రిల్లర్ గా రూపొందిన హిట్ మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. అయితే చాలా వరకు ఈ మూవీలో లూప్ హోల్స్ వున్నాయి. క్లైమాక్స్ లో హంతకుడిని చూపించిన తీరు పెద్దగా ఆకట్టుకోలేదు.అంతే కాకుండా ఓ అనాథ అయిన హంతకుడు హత్యలు చేయడం తప్పించుకుని తిరగం క్లైమాక్స్ సన్నివేశాలు పెద్దగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. అయితే దీనికి సీక్వెల్ గా చేస్తున్న `హిట్ 2 ది సెకండ్ కేస్` లో అయినా ఇలాంటి తప్పులు దోర్లకుండా.. మరో సారి పునరావృతం కాకుండా దర్శకుడు శైలేష్ కొలను జాగ్రత్త పడ్డాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీజర్ ట్రైలర్ తో ఇది కూడా ఓ సైకో పాథ్ థ్రిల్లర్ అని క్లారిటీ ఇచ్చేశాడు.

కానీ `హిట్` మూవీని హిందీలో రీమేక్ చేసి చాలా తప్పులు చేసి ఫ్లాప్ ని సొంతం చేసుకున్న శైలేష్ కొలను `హిట్ 2 ` విషయంలోనూ అవే తప్పులు చేశాడా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి. అయితే అడివి శేష్ సాధారణంగా పర్ ఫెక్ట్ అనుకున్న కథలనే సెలెక్టీవ్ గా ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్ లని సొంతం చేసుకుంటున్నాడు. ఈ మూవీ విషయంలోనూ తను కేర్ తీసుకుని వుంటే `హిట్ 2` డెఫినెట్ గా హిట్టే. కానీ అతని ఐడియాలని సూచనలని పట్టించుకోకుంటే మాత్రం శైలేష్ కొలను ఈ సారి మెప్పించడం కష్టమే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

హిట్ 2 కున్న అతి పెద్ద ప్లస్ అడివి శేష్. కారణం `క్షణం` మూవీ నుంచి `మేజర్`తో కలిపి అడివి శేష్ ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు. ఈ ఐదు సినిమాల్లో అత్యధిక శాతం హిట్ లు.. బ్లాక్ బస్టర్లే వున్నాయి.

ఆ కోవలో వస్తున్న `హిట్ 2` కూడా సక్సెస్ అయితే అడివి శేష్ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ నమోదవుతుంది. ఈ అరుదైన ఫీట్ ని సొంతం చేసుకున్న హీరో అవుతాడు. అతని క్రేజ్ ని దర్శకుడు శైలేష్ కొలను ఈ మూవీకి పర్ ఫెక్ట్ గా వాకుని వుంటే ఈ మూవీతో హిట్ ఇస్తాడు.. ఏం జరగనుందన్నది తెలియాలంటే డిసెంబర్ 2న ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.