ఫోటో స్టొరీ: ప్రేమికుల అవతారం ఎత్తిన స్టార్ కపుల్

Sat Apr 13 2019 23:38:43 GMT+0530 (IST)

Saif Ali Khan And Kareena Kapoor

బాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించే స్టార్ కపుల్స్ లో కరీనా కపూర్ - సైఫ్ అలీ ఖాన్ జంట ఒకటి.  ఈమధ్య ఈ జంటకంటే ఎక్కువగా వీరి తనయుడు.. క్యూట్ గా ఉండే తైమూర్ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. నిజానికి సైఫ్ తో ఉన్నా..కరీనా తో ఉన్నా అందరి కళ్ళూ తైమూర్ పైనే ఉంటాయి.  కానీ చాలా రోజుల తర్వాతా సైఫీనా (Saifeena) జంట ఒక రొమాంటిక్ పోజుతో అందరిని క్లీన్ బౌల్డ్ చేసింది.రీసెంట్ గా ఒక యాడ్ కోసం సైఫ్ - కరీనా ఇద్దరూ కలిసి ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోను ఫిలింఫేర్ మ్యాగజైన్ వారు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో వెంటనే వైరల్ అయింది.  స్విమ్ సూట్ లో కరీనా బీచ్ బెడ్ పై రిలాక్స్ అవుతూ కూర్చుని ఉంది.  అదే బెడ్ పై చివరన సైఫ్ కూర్చుని కరీనాను ప్రేమగా చూస్తున్నాడు.  స్లీవ్ లెస్ టీ -షర్ట్.. బాక్సర్ షార్ట్ ధరించిన సైఫ్ గాగుల్స్ ను తలపై పెట్టుకొని సూపర్ కూల్ గా ఉన్నాడు.  ఇద్దరి రొమాంటిక్ పోజు నెటిజనులకు తెగ నచ్చేసింది. ఫ్యాన్స్ అయితే సైఫీనా ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతూ.. ఈ ఫోటోకు లైక్స్ కొడుతున్నారు. అప్పట్లో ఇద్దరూ లవ్ లో ఉన్నప్పుడు ఇలా సైఫీనా(సైఫ్ + కరీనా) అని పిలిచేవారు.. ఇన్నాళ్ళకు మళ్ళీ ఆ పదం వినిపించింది.

సినిమాల విషయానికి వస్తే కరీనా ప్రస్తుతం 'గుడ్ న్యూస్' లో నటిస్తోంది. అక్షయ్ కుమార్..కియారా అద్వాని.. దిలిజిత్ దొసాంజ్ ఈ సినిమాలో ఇతర లీడ్ యాక్టర్స్.  ఇక సైఫ్ 'దిల్ బేచారా'.. 'భూత్ పోలీస్' సినిమాలలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా అజయ్ దేవగణ్ 'తానాజీ' లో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.