Begin typing your search above and press return to search.

తేజ్ ఖాతాలో అర్జెంట్ హిట్ పడాల్సిందే..!

By:  Tupaki Desk   |   28 Jan 2023 10:00 PM GMT
తేజ్ ఖాతాలో అర్జెంట్ హిట్ పడాల్సిందే..!
X
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యంగ్ మెగా హీరోల్లో వరుస సినిమాలతో తన దూకుడు చూపించాడు. అతి తక్కువ టైం లోనే మెగా ఫ్యాన్స్ కి దగ్గరైన సాయి ధరం తేజ్ ప్రతి రోజు పండగే సినిమాతో హిట్ అందుకోగా ఆ తర్వాత వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా సోసోగానే అనిపించింది. ఇక 2021లో రిపబ్లిక్ సినిమా కూడా చేశాడు సాయి తేజ్. ఆ సినిమా రిలీజ్ టైం లో అతనికి భారీ యాక్సిడెంట్ జరిగింది. దాదాపు నెలన్నర దాకా హాస్పిటల్ లో ఉన్న సాయి తేజ్ సురక్షితంగా బయట పడ్డాడు. ప్రస్తుతం మెగా హీరో విరూపాక్ష సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. మెగా మేనల్లుడుగా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటూ వస్తున్న సాయి ధరం తేజ్ కెరీర్ ఇప్పుడు రిస్క్ లో ఉందని చెప్పొచ్చు. డిఫరెంట్ కథలతో.. వరుస సినిమాలతో యువ హీరోలంతా దూసుకెళ్తున్నారు. ఆ రేసులో సాయి ధరం తేజ్ వెనకపడ్డాడు.

విరూపాక్ష ఒక్కటి మాత్రమే ప్రస్తుతం చేస్తున్నాడు సాయి ధరం తేజ్. ఆ సినిమా తర్వత మరో సినిమా ఏంటన్నది ఇంకా నిర్ణయించలేదు. కెరీర్ స్టార్టింగ్ లోనే వెంట వెంట సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరించిన సాయి ధరం తేజ్ ఇప్పుడు ఎందుకో వెనకపడ్డాడు.

విరూపాక్ష ఈ సమ్మర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి నెక్స్ట్ ఎవరితో అతని సినిమా ఉంటుందో తెలియాల్సి ఉంది. అసలైతే పవన్ తో కలిసి సాయి ధరం తేజ్ స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుంది. తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం సినిమా తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.

ఈ సినిమాలో సాయి తేజ్ కూడా ఉంటాడని తెలుస్తుంది. అలా జరిగితే మామయ్య తో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకున్నట్టు అవుతుంది సాయి తేజ్. మేనమామల మేనరిజం తో తన మార్క్ చూపిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన సాయి ధరం తేజ్ మళ్లీ కెరీర్ లో స్పీడ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఓ పక్క తమ్ముడు వైష్ణవ్ తేజ్ మరో పక్క మరో బ్రదర్ వరుణ్ తేజ్ కూడా వరుస సినిమాలతో హడావిడి చేస్తున్నారు. వారికి ధీటుగా సాయి తేజ్ కూడా వరుస సినిమాలు కమిట్ అవ్వాలని చూస్తున్నాడు. విరూపాక్ష తో హిట్ పడితే కెరీర్ లో మళ్లీ జోష్ అందుకుంటాడు సాయి తేజ్. పవన్ తో చేసే సినిమా కన్ఫర్మ్ అయితే ఓ భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో పడినట్టే లెక్క.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.