పులి పిల్లలతో మెగాహీరో స్పెషల్ పిక్!

Thu Apr 22 2021 16:00:02 GMT+0530 (IST)

Sai Tej special pic with tiger cubs

మెగాహీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం హిట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో డీసెంట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన రిపబ్లిక్ టీజర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే ప్రేక్షకులలో కూడా సినిమా పై అంచనాలు పెంచిందని చెప్పవచ్చు. అయితే తేజ్ సోషల్ మీడియాలో చాలా అరుదుగా పోస్టులు పెడుతుంటాడు.ఈరోజు తేజ్ చాలా స్పెషల్ డే అంటున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసాడు. కానీ ఆ ఫోటోలో తేజ్ తో పాటు రెండు పులి పిల్లలు కూడా ఉన్నాయి. అవి తేజ్ పెంచుకునేవే. ఈరోజు ఎర్త్ డే సందర్బంగా తన పెట్ కబ్స్ తో సాయితేజ్ ఫోటో పోస్ట్ చేసాడు. ఫోటోలో రెండు పులి పిల్లలు ఆడుకుంటున్నాయి. పక్కనే తేజ్ కెమెరా వైపు చూస్తూ పోజిచ్చాడు. వాటి పేర్లు లయనల్ లేరోయ్ లుగా తేజ్ తెలిపాడు. ప్రస్తుతం తేజ్ తో పాటు ఆ కబ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. రిపబ్లిక్ సినిమాలో ఫస్ట్ టైం తేజ్ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ జగపతిబాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జే భగవాన్ పుల్లారావు సినిమాను నిర్మిస్తున్నారు.