పెళ్లి చేస్తామని మాటిచ్చి మోసం చేశారు

Thu May 28 2020 09:00:11 GMT+0530 (IST)

Sai Sudha files cheating case against Shyam K Niadu

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశారని వర్థమాన నటి సాయి సుధ పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఐదేళ్లుగా బాంధవ్యం కొనసాగిస్తున్నా.. ఇప్పుడు పట్టించుకోకపోవడం వల్లనే తాను పోలీసు గడప తొక్కాల్సి వచ్చిందని సాయి సుధ మీడియాకి వెల్లడించారు.శ్యాం కేకి  తన భార్యతో గొడవలున్నాయి. ఆ క్రమంలోనే నాతో పరిచయం సాన్నిహిత్యం పెంచింది. మేమిద్దరం కలిసి ఓ రెండు సినిమాలకు పని చేశాం.. ఐదేళ్ల నుంచి తనతో అనుబంధం ఉంది. ఇప్పుడు భార్యతో ఉంటున్నందున నన్ను దూరం పెడుతున్నాడు. కలిసిన ప్రతిసారి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అందుకే అతడి మీద చీటింగ్ కేసు పెట్టాను`` అని తెలిపారు. 2012లో శ్యాంకే పరిచయం అయ్యారు. 2015 నుంచి రిలేషన్ కొనసాగించాం. ఒకే రంగంలో ఉండడం వల్ల స్నేహం కుదిరింది.. అప్పట్లో ఆయన భార్యతో గొడవపడేవారు. ఆ విషయాలన్నీ నాతో చెప్పేవారు. దానివల్లనే నాకు దగ్గరయ్యారని సాయి సుధ వెల్లడించారు. మా అనుబంధానికి సంబంధించి ప్రతి విషయానికి రుజువులు.. సాక్ష్యాలు ఉన్నాయి. ఆడియో.. వీడియో ఫైల్స్ ఉన్నాయని సాయి సుధ తెలిపారు. భార్యతో సమస్య సద్ధుమణిగాక నాకు ముఖం చాటేస్తున్నాడని వెల్లడించారు.

ఇక ఈ ఎపిసోడ్ లో తమ పెళ్లి చేస్తామని శ్యాం కే సోదరుడు చోటా కే నాయుడు మాటిచ్చారని తమకు అండగా నిలిచారని కూడా సాయి సుధ చెబుతున్నారు. ఇంటి గొడవలు సద్ధుమణిగితే పెళ్లి చేస్తామని మాటిచ్చారని.. అయితే ఇప్పుడు ఆయన కూడా తనకు తెలియదని తప్పించుకొంటున్నారు అని సాయి సుధ వెల్లడించారు. ``శ్యాం కే నాయుడుతో అఫైర్ విషయం హీరో సందీప్ కిషన్ తల్లికి కూడా తెలుసు. పలు మార్లు కేసు పెట్టడానికి వస్తుంటే ఆ కుటుంబసభ్యులు ఆపారు. ఇప్పుడు అంతా ఏకమై నన్ను చీట్ చేశారు`` అని ఆవేదన చెందారు. అంతే కాదు చోటా కే కుటుంబం తనని బెదిరించిన విషయాలు.. తనను హెచ్చరించినవి కాల్ రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయని సాయి సుధ చెబుతున్నారు.