Begin typing your search above and press return to search.

సినిమా.. సిరీస్ దేనికైనా రెడీ

By:  Tupaki Desk   |   23 Sep 2021 1:30 AM GMT
సినిమా.. సిరీస్ దేనికైనా రెడీ
X
మోస్ట్ హ్యాపెనింగ్‌ హీరోయిన్ సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్న సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈమె నటించిన లవ్ స్టోరీ సినిమా ఈ వారంలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ సక్సెస్ ను దక్కించుకున్న ఫిదా కాంబో అవ్వడంతో లవ్‌ స్టోరీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా లవ్ స్టోరీని దర్శకుడు శేఖర్ కమ్ముల భారీ ఎత్తున తెరకెక్కించాడని సమాచారం అందుతోంది. ఈ సినిమా విడుదల సందర్బంగా సాయి పల్లవి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన ఫ్యూచర్ ప్లాన్స్ పై స్పందించింది. సినిమాలు మాత్రమే కాకుండా పాత్ర నచ్చితే ఖచ్చితంగా వెబ్‌ సిరీస్ లు చేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించింది. తాను హీరోయిన్ గా మాత్రమే కాకుండా నటిగా కొనసాగాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఒక వెబ్‌ సిరీస్ లో నటించి నటిగా తనను తాను ప్రూవ్‌ చేసుకున్న సాయి పల్లవి మరోసారి వెబ్‌ సిరీస్‌ కు ఓకే చెప్పబోతున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం ఒక వెబ్‌ సిరీస్‌ కథను వింటున్నట్లుగా చెప్పింది. లైన్ బాగా నచ్చింది. తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకం ఉంది. పూర్తి కథ కోసం వెయిట్‌ చేస్తున్నాను. ఇంకా కన్ఫర్మ్‌ అవ్వలేదు కాని వెబ్‌ సిరీస్ ఉంటుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.

స్టార్‌ హీరోయిన్స్‌ వెబ్‌ సిరీస్ లపై ఆసక్తి చూపించడం లేదు. ఫేడ్‌ ఔట్ అవుతున్న ఇద్దరు ముగ్గురు తెలుగు హీరోయిన్స్ మాత్రమే వెబ్‌ సిరీస్ ల వెంట నడుస్తున్నారు. ఇలాంటి సమయంలో సాయి పల్లవి వెబ్‌ సిరీస్ లు అనడం చర్చనీయాంశంగా మారింది. వెబ్‌ సిరీస్ లు మరియు సినిమాలు రెండు కూడా సమాంతరంగా చేయాలంటే ఘట్స్ ఉండాలి. ముఖ్యంగా సినిమాలతో ఎక్కువ క్రేజ్ మరియు మనీ వస్తాయి. కనుక కమర్షియల్‌ గా ఆలోచించే హీరోయిన్స్ వెబ్‌ సిరీస్ లకు కాస్త దూరంగా ఉంటారు. అందుకే వెబ్‌ సిరీస్‌ లు మన సౌత్‌ లో చిన్న హీరోయిన్స్ కొత్త హీరోయిన్స్ మాత్రమే చేస్తున్నారు. సాయి పల్లవి మాత్రమే సినిమా కైనా.. సిరీస్ కైనా సిద్దం అన్నట్లుగా చెబుతోంది.