మహేష్ సినిమాని దొంగలా చూసొచ్చిన సాయి పల్లవి!

Sun May 15 2022 17:00:01 GMT+0530 (IST)

Sai Pallavi Watches Sarkaru Vari Paata

సెలబ్రిటీలకు స్వేచ్ఛ ఉండదు. సిటీలో ఎక్కడికి  వెళ్లాలన్నా ఇబ్బందే. ముఖాన్ని కప్పేసుకుని వెళ్లినా అప్పడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తప్పవు. మల్టీ ప్లెక్స్ మాల్స్ లో కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ రిస్క్ తీసుకోరు. వీలైనంత వరకూ సేఫ్ జోన్ లో ఉండాలని చూస్తారు. అందుకే హీరో..హీరోయిన్లు  విదేశాలు చెక్కేసి అక్కడే  అన్ని రకాల సంతృప్తులు చెంది తిరిగొస్తారు.జాలీగా తిరాగాలన్నా...బీచ్ అందాలు ఆస్వాదించాలన్నా..సిటీలో తిరగలన్నా..పబ్ లైఫ్ ని ఆస్వాదించాలన్నా ప్లానింగ్ అంతా బయట దేశాల్లోనే చేసుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం ఇలాంటి వాటికి అతీతం అని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఓ మల్టీప్లెక్స్ లో `సర్కారు వారి పాట` చూసొచ్చి ఇలా ఏమీ తెలియని అమాయకురాల్లో ఎలా కారెక్కి వెళ్లిపోతుందో ఈ వీడియో చూస్తేనే అర్ధమవుతుంది.

ఇదిగో ఇక్కడ పీవీకే ఆర్కే సీని ప్లెక్స్ లో సినిమా చూసి వచ్చి ఇలా దొంగలా తప్పించుకుంటుంది. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖమంతా కవర్ అయ్యేలా స్కార్ప్ తో కప్పేసింది. ముక్కు..మూతిని కవర్ చేస్తూ  కరోనా మాస్క్ తగిలించింది. చేతికి హ్యాండ్  బ్యాంగ్ తగిలించుకుని  క్యాజువల్ డ్రెస్ లో కనిపిస్తుంది. అటు ఇటూ చూసుకుంటూ ఎవరూ గుర్తు పట్టకుండా ఇలా సైలైంట్ గా కారెక్కి వెళ్లిపోయింది.

మరి థియేటర్లో కూడా ఇలాగే అన్ని కప్పేసికుని రెండున్నర గంటల పాటు సినిమా చూసిందేమో. థియేటర్ లో షో మొదలైన దగ్గర నుంచి చీకటి గానే ఉంటుంది కాబట్టి ఎవరూ గుర్తుపట్టే అవకాశం ఉండదు. ఇలాంటి ఎక్స్ పీరియన్స్ సాయి పల్లవికి కొత్తేం కాదు. గతంలో ఓసారి  పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇలాగే ముఖం కవర్ చేసుకుని వెళ్లి హ్యాపీగా నలుగురిలో కూర్చుని సినిమా చూసొచ్చింది.

ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియో ఒకటి లీకై నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా మరోసారి అలాగే చిక్కడంతో ఈ హైబ్రిడ్ పిల్ల ఎంత తెలివైంది? అంటూ నెటి జనులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. హీరోయిన్లు ఎవరూ ఇలాంటి సాహసాలు చేయరు. పొర పాటున ముఖంపై ఉండే స్కాప్ తొలగిపోతే సీన్ వేరేలా ఉంటుంది. అభిమానులు సెల్పీలు అంటూ మీద మీదకి దూసుకొస్తారు. అలాంటి సమయాల్లో కంట్రోల్ చేయడం కష్టమైన పని. చూసారా సాయి పల్లవి ఎంత రిస్క్ తీసుకుందో. అందుకే రస్క్ దొరికింది.