Begin typing your search above and press return to search.

ధనుష్.. సాయి పల్లవి జోరు ఆగేలా లేదే!

By:  Tupaki Desk   |   19 April 2019 6:43 AM GMT
ధనుష్.. సాయి పల్లవి జోరు ఆగేలా లేదే!
X
ప్రతివారం ఏదో ఒక సినిమా ఆల్బమ్ రిలీజ్ అవుతుంది. ఇక లిరికల్ సాంగ్స్ అయితే రెండ్రోజులకు ఒకటి రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ వీటిలో సంగీత ప్రియులను మెప్పించేవి ఎన్ని? అనే ప్రశ్న వేసుకుంటే చాలా నిరాశజనకమైన సమాధానం వస్తుంది. ఒక నెల సమయంలో రిలీజ్ అయ్యేవాటిలో వేళ్ళ మీద లెక్కపెట్టదగినన్ని హిట్ సాంగ్స్ కూడా ఉండడం లేదు. హిట్ అయినా వాటిని కూడా రెండు నెలలు గడిస్తే మర్చిపోతారు. కానీ కొన్ని పాటలు మాత్రం ఆడియన్స్ ను ఊపేస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో 'రౌడీ బేబీ' సాంగ్ ఒకటి.

అప్పట్లో ఫిదా సినిమాలో 'వచ్చిండే' సాంగ్ తెలుగు ప్రేక్షకులనే కాకుండా సౌత్ నే ఊపేసింది. యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు రౌడీ బేబీ హవా సాగుతోంది. వచ్చిండే వ్యూస్ రికార్డులను ఎప్పుడో దాటేసిన ఈ రౌడీ బేబీ తాజాగా భారీ రికార్డులు సృష్టిస్తోంది. ఈమధ్యే ఈ పాట 400 మిలియన్ల వ్యూస్ మార్కును దాటేసింది. లైక్స్ 2 మిలియన్. ఈ నంబర్స్ అన్నీ వీడియో సాంగ్ ను అప్లోడ్ చేసిన మూడు నెలల్లో వచ్చినవి. సౌత్ లో మరే పాట కూడా వ్యూస్ విషయంలో రౌడీ బేబీ కి దరిదాపుల్లో లేదు. వచ్చిండే సాంగ్ కు ఇప్పటివరకూ 196 మిలియన్ వ్యూస్ మాత్రమే ఉన్నాయి.

సౌత్ సాంగ్స్ బాలీవుడ్ సాంగ్స్ తో పోలిస్తే రీచ్ తక్కువ కాబట్టి సహజంగానే వ్యూస్ కూడా తక్కువే ఉంటాయి. కానీ ఈ రౌడీ బేబీ రచ్చ చూస్తుంటే బాలీవుడ్ చార్ట్ బస్టర్లకు కూడా వ్యూస్ విషయంలో సవాలు విసిరేలా ఉంది. ఈ రౌడీ బేబీ పాటకు తెరపై తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో.. డ్యాన్స్ తో ఆకర్షణ తీసుకువచ్చినవారు ధనుష్ - సాయి పల్లవి. పాటకు సంగీతం అందించింది యువన్ శంకర్ రాజా. ధనుష్.. దీ(దీక్షిత) ఈ పాటను పాడారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫి అందించారు.