పిక్ టాక్ : ఈమాత్రం చూపించినా ఆహా.. ఓహో అనేస్తున్నారు

Wed Jan 26 2022 16:33:27 GMT+0530 (IST)

Sai Pallavi Latest Photoshoot

ఈమద్య కాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోల్లో స్కిన్ షో కు హద్దు అదుపు లేకుండా పోతుంది. కొందరు హీరోయిన్స్ మరీ విచ్చలవిడిగా స్కిన్ షో చేస్తుంటే మరి కొందరు గ్లామర్ ఫొటోలతో మతులు పోగొడుతున్నారు. కాని ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ మాత్రం స్కిన్ షో కు పూర్తి దూరంగా ఉంటున్నారు. వారిలో సాయి పల్లవి ఒకరు అనడంలో సందేహం లేదు. కెరీర్ ఆరంభం నుండి పద్దతైన పాత్రలు చేస్తూ ఏమాత్రం స్కిన్ ను చూపించకుండా కెరీర్ లో ముందుకు సాగుతున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు అందాల ప్రదర్శణకు పూర్తి వ్యతిరేకం. గ్లామర్ రోల్స్ కు ఎప్పుడు దూరం అంటూ చెప్పే ఈ అమ్మడు సోషల్ మీడియా లో కూడా స్కిన్ షో ఫొటోలను షేర్ చేయదు.తాజాగా ఈ ఫొటోలను స్టైలిష్ట్ అయిన నీరజ కోన షేర్ చేసింది. ఎప్పుడు చీర కట్టులో మరియు పద్దతైన డ్రస్ ల్లో కనిపించే సాయి పల్లవి ఈసారి కాస్త విభిన్నంగా కనిపించి కనిపించనట్లుగా నడుము అందాలను చూపిస్తూ జనాలను ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ అమ్మడు చూపించిన అందం కొంతే అయినా కూడా దానికే జనాలు ఆహా ఓహో అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు సాయి పల్లవి ఒక్కతి అయినా పద్దతిగా ఉంది అనుకుంటే ఆమెను కూడా స్కిన్ షో కు ప్రేరేపిస్తున్నారా అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. మొత్తానిని సాయి పల్లవి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె గురించిన చర్చ మళ్లీ మొదలు అన్నట్లుగా జరుగుతోంది.

సాయి పల్లవి తాజాగా శ్యామ్ సింగ రాయ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా లో సెకండ్ హాఫ్ లో మాత్రమే సాయి పల్లవి ఉంటుంది. అయినా కూడా ఆమె సినిమా మొత్తంను కూడా తనదే అన్నట్లుగా తిప్పేసుకునేలా నటించింది. ఒకానొక సమయంలో నాని ని డామినేట్ చేసినట్లుగా కూడా సాయి పల్లవి నటించింది అంటూ అభిమానులు ప్రశంసలు అందుకుంది. అద్బుతమైన సాయి పల్లవి నటన ఆమెకు మరిన్ని ఆఫర్లు తెచ్చి పెడుతుంది. అందాల ప్రదర్శణ విషయంలో తాను కెరీర్ ఆరంభం విషయంలో ఎలాంటి స్టాండ్ ను తీసుకుందో ఇప్పుడు కూడా అదే తరహా లో అందాల ప్రదర్శణకు పూర్తి దూరంగా ఉంటూ వచ్చింది. ముందు ముందు కూడా స్కిన్ షో పాత్రలకు ఆమె దూరం గా ఉంటుందేమో చూడాలి.