రూ.2కోట్లు ఇస్తామని చెబితే స్టార్ హీరోయిన్ నో చెప్పేసిందట

Sun Feb 16 2020 17:52:50 GMT+0530 (IST)

Sai Pallavi Gives Clarification on about Her Remuneration

ముఖం మీద మెటిమలు ఉన్న అమ్మాయి హీరోయిన్ అవుతుందా? మేకప్ అవసరం లేదు.. నేచురల్ గా ఉంటాననే అమ్మాయి ఆగ్ర హీరోయిన్ అయ్యే అవకాశం ఉందా? అంటే.. నో అని చెప్పేస్తారు. కానీ.. ఇలాంటి స్టేట్ మెంట్లను తప్పుగా నిరూపించింది సాయి పల్లవి. ఇటీవల ఆమె నటించిన సినిమాలు వరుస పెట్టి ఫట్ అంటున్న వేళ కూడా బిజీగా ఉందీ ఫిదా పోరి.హిట్ దక్కితే చెలరేగిపోవటం.. ఫట్ అయితే బాధ పడటం లాంటివి సాయిపల్లవికి అస్సలు తెలీని విషయం. జయాపజయాల్ని ఒకేలా తీసుకునే మైండ్ సెట్ ఆమె సొంతం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చాలామంది హీరోయిన్లలో లేని కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఆమెలో చాలానే ఉన్నాయి. ఈ మధ్యన ఆమె నటించిన పడి పడి లేచే మనసు సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమా కింద నిర్మాత రూ.40లక్షలు బాకీ ఉన్నారు. ప్లాప్ అయ్యిందిగా ఇవ్వక్కర్లేదంటూ.. తన బాకీని రైటాఫ్ చేసిన రేర్ పీస్ గా సాయి పల్లవిని చెప్పాలి.

ఇటీవల ఒక ఫేమస్ ఫేస్ క్రీం సంస్థ తాము తీసే యాడ్ లో నటించాలని.. తమ క్రీం రాసుకుంటే ముఖం మారిపోతుందన్న మాటల్ని చెబితే రూ.2కోట్లు ఇస్తామంటే.. లైట్ తీస్కో అని చెప్పేసిందట. కోట్లు ఇస్తే మాత్రం.. అలాంటి మాటలు చెబుతామా ఏంది? అని రిజెక్ట్ చేసేసిందట. అంతేనా.. కథ డిమాండ్ చేయటంలో ముద్దు సీన్లు తప్పనిసరి అన్న సినిమా ఆఫర్లను కూడా వదులుకుందీ బ్యూటీ.

ఎంత సంపాదిస్తే మాత్రం.. రాత్రి అయ్యేసరికి తినాల్సిన మూడు చపాతీల కంటే ఎక్కువ తినలేం కదా? ఎక్కువ సంపాదిస్తే.. మాత్రం ఎక్కువ తింటారా? ఏంటని ఎదురు ప్రశ్నించటం ఆమెకే చెల్లుతుంది. సంతోషంగా.. తాను నమ్మిన సిద్ధాంతాలు.. విలువల్ని వదిలేసుకొని నటించే ఛాన్సే లేదని తేల్చేస్తుందట. ఇలా చేయటం ఫిదా పోరికి మాత్రమే సాధ్యమవుతుందంటున్నారు. సాయి పల్లవా మజాకానా?