అలాంటి డ్రస్ ల్లో కనిపించడంపై సాయి పల్లవి క్లారిటీ

Tue May 24 2022 14:00:01 GMT+0530 (IST)

Sai Pallavi Clarity on appearing in such dresses

టాలీవుడ్ ప్రేక్షకులను మొదటి సినిమా తోనే 'ఫిదా' చేసి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకోవడం మాత్రమే కాకుండా అత్యధిక పారితోషికం దక్కించుకున్న హీరోయిన్స్ జాబితాలో చేరిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. తెలుగు లో ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువ.. చేస్తున్న సినిమాలు ఇంకా తక్కువే. అయినా కూడా ఈ అమ్మడి డిమాండ్ అంతా ఇంతా కాదు అనే విషయం తెల్సిందే.ఈమద్య కాలంలో తన వద్దకు వచ్చిన పలు ఆఫర్లను వెనక్కు పంపిన సాయి పల్లవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐటెం సాంగ్ గురించి అడిగిన సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్ గా సాయి పల్లవి ఇప్పటివరకు స్కిన్ షో కూడా చేయకుండా సినిమాల్లో కనిపించింది. ఆమె అందం తో పాటు అభినంతో కూడా మెప్పించి ప్రతి ఒక్కరిని తన అభిమానులుగా మార్చేసుకుంది.

అలాంటి సాయి పల్లవి ఐటెం సాంగ్ లో నటించాలని కొందరు భావిస్తున్నారు అంటూ మీడియా వారు ఆమెను ప్రశ్నించిన సమయంలో.. తనకు ఐటెం సాంగ్ సెట్ అవ్వదు అంటూ తేల్చి చెప్పింది. తాను ఐటెం సాంగ్స్ కోసం కంఫర్ట్ గా ఉండని ఔట్ ఫిట్ ను ధరించలేను. డ్రెస్సింగ్ మరియు డాన్స్ మూమెంట్స్ సరిగా లేకుంటే నాకు ఇబ్బందిగా ఉండి నటించడం నా వల్ల కాదు.

సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయాలనే ఆసక్తి నాకు లేదు. ఇబ్బందిగా ఉండే డ్రస్ ల్లో మరియు డాన్స్ మూమెంట్స్ తో కష్టపడాల్సిన అవసరం నాకు లేదు అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. స్పెషల్ సాంగ్స్ విషయం లో ఎప్పుడు కూడా నా ఆలోచన.. అభిప్రాయం ఇదే. నేను వాటికి కరెక్ట్ కాదు.. నాకు స్పెషల్ సాంగ్స్ కంఫర్ట్ కాదు అందుకే నేను చేయలేను అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

శ్యామ్ సింగ రాయ్ సినిమా లో అద్బుతమైన పాత్రలో నటించి మెప్పించిన సాయి పల్లవి త్వరలో విరాటపర్వం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా కోసం దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఆమె అభిమానులు వెయిట్ చేస్తున్నారు. రానా హీరోగా నటించినా కూడా సాయిపల్లవి సినిమా అన్నట్లుగానే ఆ సినిమాను ప్రేక్షకులు చూస్తున్నారు.

విరాటపర్వం సాయి పల్లవి చివరి సినిమానా అంటూ అంతా చర్చించుకుంటున్న సమయంలో అనూహ్యంగా గార్గి అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తానే స్వయంగా ప్రకటించింది. కథల ఎంపిక విషయంలో సాయి పల్లవి మరీ అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కువ సినిమాల్లో చేయడం లేదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.