పెద్ద సినిమాలన్నింటికి ఈయనే

Fri Jul 23 2021 17:00:01 GMT+0530 (IST)

Sai Madhav Burra is directing most of these films

టాలీవుడ్ లో ప్రస్తుతం రూపొందుతున్న పెద్ద సినిమాలు అనగానే ఠక్కున వినిపించే పేర్లలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాటు రామ్ చరణ్ శంకర్ ఇంకా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ఇంకా కొన్ని సినిమాలున్నాయి. ఈ సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలకు సాయి మాధవ్ బుర్ర దర్శకత్వం వహిస్తున్నాడు.కొన్ని సినిమాలు షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా కొన్ని షూటింగ్ ప్రారంభం కాబోతున్నాయి. మొత్తానికి టాలీవుడ్ లో ది మోస్ట్ వాంటెడ్ డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ నిలిచారు అనడంలో సందేహం లేదు. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా ఈయన తన మాటలను అందిస్తున్నారు.

ఇటీవలే తనకు జెంటిల్ మన్ సినిమా చూసిన సమయంలో శంకర్ గారితో ఒక్క ఫొటో తీసుకున్నా చాలు అనిపించింది. అంతటి గొప్ప దర్శకుడితో చరణ్ మూవీకి మాటలు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ప్రకటించాడు. ఇదే సమయంలో ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి కూడా పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు.

రాజమౌళి గారితో వర్క్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. జక్కన్న కు ఏం కావాలో ముందే క్లారిటీ ఉంటుంది. అందుకే ఆయన తనకు కావాల్సిన విధంగా డైలాగ్ లు రాయించుకుంటాడు అంటూ రాజమౌళి గురించి చెప్పుకొచ్చాడు.

ఇక తాజాగా హరి హర వీరమల్లు సినిమా గురించి సాయి మాధవ్ బుర్రా స్పందించాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా అద్బుతంగా ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా షూటింగ్ పునః ప్రారంభించేందుకు క్రిష్ ఏర్పాట్లు చేస్తున్నాడు. సినిమా ను పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందిస్తున్నారు.

ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ గజ దొంగ పాత్రలో కనిపించబోతున్నాడట. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని డైలాగ్ లు సాయి మాధవ్ అందిస్తున్న కారణంగా అద్బుతంగా ఉంటాయనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పలు పెద్ద సినిమాలకు ఈయనే డైలాగ్స్ ను రాస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కూడా ఈయన పేరే వినిపిస్తుంది.