అమ్మా నాన్న విడాకులపై మెగా హీరో స్పందన

Tue Apr 23 2019 14:55:52 GMT+0530 (IST)

Sai Dharam tej React On Parents Divorce

మెగా మేనల్లుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్ మెల్ల మెల్లగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను బిల్డ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ గత రెండేళ్లలో వరుసగా ఆరు ఫ్లాప్ లు మూట కట్టుకున్నాడు. దాంతో తేజ్ కెరీర్ పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అలాంటి సమయంలో 'చిత్రలహరి' చిత్రంతో మళ్లీ పుంజుకున్నాడు. చాలా కాలం తర్వాత సక్సెస్ వచ్చిన నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ తన సంతోషంను మీడియాతో పంచుకున్నాడు. ఈ సందర్బంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న విషయమై స్పందించాడు.సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న విషయం చాలా మందికి తెలియదు. ఇండస్ట్రీలో కొద్ది మందికి తప్ప ఎక్కువ శాతం మందికి మెగా సిస్టర్ విడాకుల విషయమే తెలియదు. పదిహేను సంవత్సరాల క్రితమే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. తేజ్ పదవ క్లాస్ లో ఉన్న సమయంలో వారు విడాకులు తీసుకున్నారట. ఆ విషయమై తేజ్ స్పందిస్తూ... వారిద్దరు కలిసి ఉండటం కుదరలేదు. కలిసి ఉండటం కుదరని సమయంలో విడిపోవడం మంచిదని నేను భావిస్తాను వారిద్దరి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. అది జరిగి పోయి 15 ఏళ్లు అయ్యింది ఆ విషయం ఇప్పుడు మర్చి పోయి జీవితంలో ముందుకు వెళ్తున్నాం. నాన్నతో ఇప్పటికి కూడా మంచి రిలేషన్ ఉంది. ఆయనకు సినిమాల గురించి తెలియదు కనుక ఆయనతో సినిమాల గురించి చర్చించను. అయితే నాన్నతో రిలేషన్ షిప్ అయితే కొనసాగుతుందని తేజ్ అన్నాడు.

ఇక 2011లో అమ్మ మరో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతానికి మేమిద్దరం ఉన్నా మాకు పెళ్లి అయ్యి మా జీవితాలు మేము గడుపుతున్న సమయంలో అమ్మ ఒంటరి అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆమెకు మరో పెళ్లి చేసుకుని తోడు చూసుకుంటే బాగుంటుందని నేను తమ్ముడు భావించాం. అనుకున్నట్లుగానే అమ్మ పెళ్లి చేసుకుంది. ఆయన ఒక డాక్టర్ స్టెప్ ఫాదర్ తో నాకు తమ్ముడికి మంచి రిలేషన్ ఉంది. లోన్లీ నెస్ లేకుండా ఉండటం కోసం అమ్మ తీసుకున్న రెండవ పెళ్లి నిర్ణయంను కూడా మేము సమర్ధించాం. అమ్మ మమ్ములను చాలా జాగ్రత్తగా పెంచింది ప్రతి విషయంలో కూడా ఆమె మాపై చూపిన శ్రద్దను మర్చి పోలేం. అందుకే అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా మేము సమర్దిస్తాం అన్నాడు.