మెగాస్టార్ బయోపిక్ చేయలేననేశాడు!

Sun Dec 08 2019 18:35:23 GMT+0530 (IST)

Sai Dharam Tej on About Chiranjeevi Biopic

మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తెరకెక్కిస్తే అందులో ఎవరు నటిస్తారు? అని ప్రశ్నిస్తే సాయి తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ నటిస్తే బావుంటుందన్న అభిప్రాయం మెజారిటీ ఫ్యాన్స్ లో వ్యక్తమైంది. అంతేకాదు అలాంటి అవకాశం వస్తే అందుకు తాము సిద్ధమేనని అయితే చరణ్ అయితే ఇంకా బావుంటుందని ఇంతకుముందు సాయి తేజ్.. వరుణ్ తేజ్ వ్యాఖ్యానించారు.తాజాగా మరోసారి అదే ప్రశ్న `ప్రతి రోజు పండగే` ప్రమోషన్‌లో సాయి తేజ్ కు ఎదురైంది. మెగాస్టార్ బయోపిక్ తెరకెక్కిస్తే మీరు నటిస్తారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తాను మెగాస్టార్ జీవితకథకు న్యాయం చేయలేనని సాయి తేజ్ అన్నారు. మెగాస్టార్ పాత్రలో రామ్ చరణ్ అయితేనే పర్ఫెక్ట్ అని అభిప్రాయపడ్డాడు.

అయితే సాయి తేజ్ ఎందుకిలా అనేశాడు? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి స్టార్ డమ్ దృష్ట్యా.. చిరుకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా అంత పెద్ద లివింగ్ లెజెండ్ పాత్రలో నటిస్తే ఏం తేడా వచ్చినా అభిమానుల నుంచి విమర్శలు అంతే పెద్ద స్థాయిలో ఉంటాయని సాయి తేజ్ వెనక్కి తగ్గాడా?  లేక చరణ్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఆ కామెంట్ చేశాడా? అన్న చర్చా సాగుతోంది. ఇకపోతే యంగ్ సాయి తేజ్ లో సుప్రీం హీరో చిరంజీవి కనిపిస్తాడన్నది అభిమానుల మాట. మెగాస్టార్ రీమిక్స్ పాటల్లో తను ఒదిగిపోయినంతగా ఇంకెవరూ ఒదిగిపోలేరు. ఇక ఎనర్జిటిక్ డ్యాన్సల్లోనూ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ ని చూపించడంలోనూ సాయి తేజ్ తర్వాతనే. మరి అతడు తాను చేయనని అనేస్తున్నాడు. పైగా చరణ్ మాత్రమే చేయాలని అంటున్నాడు.

అసలు చిరంజీవి బయోపిక్ తీస్తారా లేదా? అన్నదానిపై కొణిదెల కంపెనీ అధినేత నుంచే సమాధానం రావాల్సి ఉంది. ఇక చిరంజీవి బయోపిక్ తీసే ఆలోచన లేదని చరణ్ ఇంతకుముందు అన్నారు. ఒకవేళ తీసినా అందులో చరణ్ .. సాయి తేజ్ లలో ఎవరో ఒకరు నటిస్తే బావుంటుందని ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు అన్న సంగతిని గుర్తుకు తెచ్చుకోవాల్సిందే.