Begin typing your search above and press return to search.

లోడ్ చేసిన గ‌న్ లా సాయి ధరమ్ తేజ్?

By:  Tupaki Desk   |   21 Oct 2021 4:38 AM GMT
లోడ్ చేసిన గ‌న్ లా సాయి ధరమ్ తేజ్?
X
హీరో సాయి ధరమ్ తేజ్ ఆక‌స్మిక బైక్ యాక్సిడెంట్ ప‌రిశ్ర‌మ‌కు అభిమానుల‌కు బిగ్ షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. వినాయక చతుర్థి రోజున బైక్ ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరిన సాయి తేజ్ చాలా కాలం కోమాలోనే ఉన్నార‌ని ప్ర‌చార‌మైంది. కోలుకున్నాక‌ ఇటీవ‌లే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. ఆరోగ్యం ప‌రంగా అత‌డు మంచి పురోగతిని సాధిస్తున్నాడని త‌న‌ని విజిట్ చేసిన వారు చెబుతున్నారు. ఒక నెల పాటు అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స పొందిన తరువాత సాయి విజయ దశమి సందర్భంగా ఇంటికి తిరిగి వచ్చాడు. 15 అక్టోబ‌ర్ అతని పుట్టినరోజు కావ‌డంతో అభిమానులు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. అతడు త్వ‌ర‌గా కోలుకుని తిరిగి సినిమాల్లో న‌టించాల‌ని అంతా ఆకాంక్షించారు.

బుధవారం రాత్రి సాయి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ లో ఓ ఆస‌క్తిక‌ర ఫోటోని షేర్ చేసారు. సాయిని తాను కలిశానని అద్భుతంగా మాట్లాడుతున్నాడ‌ని ట్వీట్ చేశారు. అతను సూపర్ ఫిట్ గా ఉన్నాడని జయించడానికి సిద్ధమవుతున్నాడ‌ని చెప్పడానికి సంతోషంగా ఉంద‌ని అన్నారు. ``ఫుల్లీ అండ్ మళ్లీ లోడెడ్..`` అంటూ సాయి పురోగతి గురించి హరీష్ ట్వీట్ చేసారు.

సాయితేజ్ న‌టించిన రిప‌బ్లిక్ ఇటీవ‌ల రిలీజైంది. ఇందులో సీరియ‌స్ రోల్ చేసినా ఆక‌ట్టుకున్నాడ‌న్న టాక్ వినిపించింది. సినిమా య‌వ‌రేజ్ గా ఆడింది. నవంబర్ నుండి ఇంకా పేరు పెట్టని అతీంద్రియ ఫాంటసీ థ్రిల్లర్ షూటింగును సాయి తిరిగి ప్రారంభిస్తారు. ఈ చిత్రాన్ని సుకుమార్ - బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇత‌ర వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.