షూటింగ్ పూర్తిచేసుకున్న మెగాహీరో యాక్షన్ డ్రామా!

Tue Feb 23 2021 20:00:01 GMT+0530 (IST)

Sai Dharam Tej Upcoming Movie Updates

టాలీవుడ్ యువహీరో సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం తన సినిమాల పట్ల స్పీడ్ పెంచేసాడు. సోలో బ్రతుకే సో బెటర్ హిట్ తర్వాత తేజ్ నటిస్తున్న కొత్త సినిమా రిపబ్లిక్. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. చాలా గ్యాప్ తర్వాత దేవాకట్టా నుండి సినిమా రాబోతుండటంతో ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఎందుకంటే ఓ రచయితగా దర్శకుడుగా దేవా తనను తను ప్రూవ్ చేసుకున్నాడు. ఆలోచనాత్మకంగా తెరకెక్కించడంలో దేవాకట్టా చాలా సిద్ధహస్తుడని టాలీవుడ్ మేకర్స్ కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. రిపబ్లిక్ సినిమా గురించి కొత్తగా అప్డేట్ అందించాడు దేవా. ఇదివరకే ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా.. ఇటీవలే మా సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. కేవలం 64 రోజుల్లో ఎలాంటి కరోనా కేసులు లేకుండా పూర్తి చేయడం ఆనందంగా ఉందని త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తామని చెప్పాడు డైరెక్టర్. అయితే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుండగా..!జగపతిబాబు రమ్యకృష్ణ కీలకపాత్రలలో కనిపించనున్నారు. అయితే చాలాకాలం తర్వాత రమ్యకృష్ణ ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిందని సమాచారం. ఈ సినిమాను జేబి ఎంటర్టైన్మెంట్స్ జీ స్టూడియోస్ బ్యానర్లపై భగవాన్ పుల్లారావులు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అటు డైరెక్టర్ కు ఇటు హీరోకు భారీ హిట్టు పడుతుందని మెగాఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఎప్పటిలాగే దేవా మళ్లీ ఈ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసినట్లు మోషన్ పోస్టర్ చూస్తేనే అర్ధమైంది. చూడాలి మరి మెగాహీరో ఎలా ఆకట్టుకుంటాడో!