Begin typing your search above and press return to search.

మ్యూజిక్ ఫెయిలైనా స్నేహం స‌క్సెస్

By:  Tupaki Desk   |   16 Dec 2019 11:00 AM GMT
మ్యూజిక్ ఫెయిలైనా స్నేహం స‌క్సెస్
X
వ‌రుస‌గా అర‌డ‌జ‌ను ఫ్లాపుల‌తో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు సుప్రీం హీరో సాయి తేజ్. అయితే ఆ ఫ్లాపుల‌న్నిటినీ విశ్లేషించుకునే క్ర‌మంలో థ‌మ‌న్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. అత‌డితో ప‌ని చేయ‌డం వ‌ల్ల‌నే సాయి ధ‌ర‌మ్ కి వ‌రుస‌గా ప‌రాజ‌యాలు త‌ప్ప‌లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా ప‌దే ప‌దే థ‌మ‌న్ ని రిపీట్ చేస్తూ సాయి తేజ్ సినిమాలు చేశాడు. థ‌మ‌న్ తో స్నేహాన్ని అత‌డు వీడ‌లేదు. ఈనెల 20న సినిమా రిలీజ్ కానుంది. ఈ ఆదివారం సాయంత్రం ప్రీరిలీజ్ వేడుక‌లో సాయి తేజ్ స్ఫూర్తివంత‌మైన స్పీచ్ తో ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా త‌న స్నేహితుడు థ‌మ‌న్ పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు .. త‌మ స్నేహంపై బుర‌ద జ‌ల్లిన వారికి త‌న‌దైన శైలిలో చీవాట్లు పెట్టారు.

థ‌మ‌న్ కాంబినేష‌న్ వ‌ల్ల నీ సినిమాలు స‌క్సెస్ కాలేదని కొంద‌రన్నారు. థ‌మన్ బీట్స్ వ‌ల్ల సినిమాలు ఫెయిల్ కాలేదు. ఆ ఫ్లాప్ ల‌కు థ‌మ‌న్ మ్యూజిక్ ఎంత మాత్రం కార‌ణం కాదని సాయి తేజ్ అన్నాడు. ఒక స్నేహితుడిలాగా థ‌మన్ ఎప్పుడూ నాతో ఉండాలి... ఈ స్నేహం వీడ‌ను.. అని చెప్పారు. స్క్రిప్టు ఫెయిల్ వ‌ల్ల‌నే సినిమాలు ఫెయిల‌య్యాయి త‌ప్ప సంగీతం బాగోక పోవ‌డం వ‌ల్ల ఫెయిల‌వ్వ‌లేదని థ‌మ‌న్ ని వెన‌కేసుకు రావ‌డం ఆస‌క్తిక‌రం. ఇక త‌న స్నేహితుడు థ‌మ‌న్ సంగీతం అందించిన ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రం ఏమేర‌కు హిట్ కానుందో చూడాలి.

ఈ వేదిక‌పై సాయి తేజ్ మాట్లాడుతూ...``నాకు ఎప్పుడూ అండగా నిలబడింది మెగా ఫ్యాన్స్. అభిమానులంతా గర్వపడాలి. నేను సినిమాలో సిక్స్ ప్యాక్ చేశాను. మారుతి గారు నాకోసం అదిరిపోయే స్క్రిప్ట్ చేశారు. సినిమా చూశాక మీకు అర్థం అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సుల‌తో పాటు అభిమానుల బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా. ఐదేళ్ల క్రింద పిల్లా నువ్వులేని జీవితం విడుదలయ్యింది, మళ్ళీ ఇప్పుడు అరవింద్ గారితో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. మ‌ళ్లీ హిట్ కొడ‌తాం`` అని అన్నారు.