Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్‌..బ‌న్నీలో సాయితేజ్ అభిమానించేది ఎవ‌ర్నో తెలుసా?

By:  Tupaki Desk   |   25 Nov 2022 2:30 AM GMT
చ‌ర‌ణ్‌..బ‌న్నీలో సాయితేజ్ అభిమానించేది ఎవ‌ర్నో తెలుసా?
X
మెగా మేన‌ల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయితేజ కెరీర్ ని బిల్డ్ చేసుకునే ప‌నిలో ఉన్నాడు. ఆరంభం మెరిపించినా అటుపై ఒక్క‌సారిగా ఆ మెరుపులు త‌ర్వాత క‌నిపించ‌లేదు. చేతిలో అవ‌కాశాలున్నా..స‌క్సెస్ రేసులో వెనుక‌బ‌డ్డాడు. అనుకోకుండా బైక్ ప్ర‌మాదం వంటి సంఘ‌ట‌న‌ల‌తో సాయితేజ్ వేగం మ‌రింత త‌గ్గింది. ఆ ముందే రిలీజ్ అయిన రిప‌బ్లిక్ మంచి సినిమా చేసాడు అని పేరు త‌ప్ప క‌మ‌ర్శియ‌ల్ గా వ‌ర్కౌట్ కాని సినిమా అది.

ప్ర‌స్తుతం శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో హిట్ అందుకుని రేసులో నిల‌వాల‌ని ఆశిస్తున్నాడు. వెన‌కొచ్చిన త‌మ్మ‌డు బిజీ స్టార్ అయినా ముందొచ్చిన అన్న‌మాత్రం ఇంకా అంత బిజీ కాలేదు. మ‌రి ఇక‌పై కెరీర్ ని ఎలా ప్లాన్ చేసాడు అన్న‌ది చూడాలి. ఇక సాయితేజ్ మెగా మామ‌ల్లో ఎక్కువ‌గా అభిమానించేది చిరంజీవి...ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ త‌ర్వాత నాగ‌బాబుల్నే.

మామ‌ల స‌హ‌కారంతోనే ప‌రిశ్ర‌మ‌లోకి రాగ‌లిగాడు. ఇక మెగా వార‌సుల్లో ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డేది ఎవ‌ర్ని అంటే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అని అంటున్నారు. చ‌ర‌ణ్ తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్ర‌స్తావించ‌గా...చ‌ర‌ణ్ నే ముందు ఆప్ష‌న్ గా చూపించాడు. చిన్న‌ప్పటి నుంచి త‌న‌తో మంచి ర్యాపో ఉంద‌ని...అత‌నితో రిలేష‌న్ షిప్ స్పెష‌ల్ గా ఉంటుంద‌ని తెలిపారు.

ఇక న‌టులుగా మాత్రం మామ‌లు ఇద్ద‌రి త‌ర్వాతే ఎవ‌రైనా అంటున్నాడు. మొత్తానికి మెగా ఫ్యామిలీతో సాయి తేజ్ రిలేష‌న్ మాత్రం చాలా బ‌ల‌మైన‌దిగా తెలుస్తోంది. తేజ్ గురించి చిరంజీవి...ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా మాట్లాడుతారు. తేజ్ లో పీకే పొలిక‌లు..న‌ట‌న‌లో అత‌ని అనుక‌ర‌ణ క‌నిపిస్తుందని అభిమానులు అంటారు.

అలాగే పీకేలానే గొప్ప‌వ్య‌క్తిత్వం.. మ‌న‌స్త‌త్వం గ‌ల‌వాడ‌ని సోర్సెస్ చెబుతున్నాయి. సామాజిక కార్య‌క్రమాల్లో ముందుంటాడుట‌. ఎవ‌రైనా స‌హాయం అంటే ముందుకెళ్లి లేద‌న‌కుండా చేస్తారుట‌. స్టార్ అయిన ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న విరాళాల నెంబ‌ర్ పెరిగిన‌ట్లు స‌మాచారం. అలాంటి న‌టుడు సినిమాలు ఎక్కువ‌గా చేయ‌గ‌లిగితే అభిమానులు మ‌రింత సంతోషిస్తారు. నాలుగు కుటుంబాల‌కు ఆస‌రాగానూ నిల‌బ‌డ‌తారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.