మిస్టికల్ థ్రిల్లర్ #SDT15 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన మెగా హీరో...!

Fri Aug 14 2020 13:45:04 GMT+0530 (IST)

Sai Dharam Tej Announces his #SDT15

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సుకుమార్ జెట్ స్పీడ్ తో సినిమాలు అనౌన్స్ చేసేస్తున్నాడు. 'చిత్రలహరి' 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ క్రమంలో 'ప్రస్థానం' దేవా కట్ట దర్శకత్వంలో ఓ సినిమాని స్టార్ట్ చేసాడు. దీంతో పాటు గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడితో 'భగవద్గీత సాక్షిగా' అనే ప్రాజెక్ట్ లైన్లో పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్టుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు తేజ్. నిన్న సోషల్ మీడియా వేదికగా ''సిద్ధార్థ నామ సంవత్సరే.. బృహస్పతి : సింహరాశౌ... స్థిత సమయే.. అంతిమ పుష్కరే'' లోడింగ్ అంటూ ప్రకటించిన సాయి ధరమ్ తేజ్.. తాజాగా ట్విట్టర్ వేదికగా తన కెరీర్లో 15వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.కాగా సాయిధరమ్ తేజ్ తన కెరీర్ లో మొదటిసారి మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్నాడు. 'భమ్ బోలేనాథ్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ రైటింగ్స్ పై సుకుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అనౌన్సమెంట్ పోస్టర్ తేజ్ ట్విట్టర్ లో రిలీజ్ చేసాడు. ఈ పోస్టర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా ఉంది. ఈ విషయాన్ని తేజ్ వెల్లడిస్తూ ''న్యూ జోనర్ ట్రై చేయడం ఎల్లప్పుడూ ఎక్జయిటింగ్ గా ఉంటుంది.. అది కూడా నా ఫేవరేట్ మూవీ మేకర్ సుకుమార్ సహకారంతో ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. #SDT15 ఒక ఆధ్యాత్మిక థ్రిల్లర్'' అని పేర్కొన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్న తేజ్ కి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.