Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : 'కబాలి' కూతురు రొమాంటిక్‌ ఫోజ్‌

By:  Tupaki Desk   |   27 July 2021 11:30 PM GMT
ఫొటోటాక్ : కబాలి కూతురు రొమాంటిక్‌ ఫోజ్‌
X
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ 'కబాలి' సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ సాయి ధన్షిక. రజినీకాంత్ కు కూతురుగా చాలా రఫ్‌ పాత్రలో కనిపించిన ధన్షిక ఆ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువ అయ్యింది. తెలుగు లో కూడా ఈమెకు ఆఫర్లు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల తెలుగు సినిమాలకు పెద్దగా ఆసక్తి చూపించని ఈ అమ్మడు తమిళంలో మాత్రం బిజీ బిజీగా సినిమాలు చేస్తూనే ఉంది. తమిళంలో ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున ఈమె చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఆరు సినిమాల వరకు ఉన్నాయి. అందులో కొన్ని షూటింగ్‌ ముగించుకుని విడుదలకు సిద్దంగా ఉండగా.. కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

సాయి ధన్షిక అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గదు. కబాలి సినిమా లో రజినీకాంత్‌ కూతురుగా పూర్తిగా మగరాయుడి గెటప్ లో కనిపించిన ఈమె ఆ తర్వాత నుండి తన రూటు మార్చేసింది. అందాల ప్రదర్శణ విషయంలో తనకు తాను సాటి అన్నట్లుగా ఈమె ఎక్స్‌ పోజింగ్‌ ఉంటుంది. రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో తన రకరకాల ఫొటో షూట్ లను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. పద్దతైన చీర కట్టులో కనిపించడంతో పాటు వర్కౌట్‌ డ్రస్‌ ల్లో ఆ తర్వాత అందమైన హాట్ కాస్ట్యూమ్స్ లో.. పార్టీ ఔట్‌ ఫిట్‌ ఇలా రకరకాలుఆ ఈమె కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటోలు సాయి ధన్షిక అందాల రాబోత పీక్స్‌ లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందమైన ఔట్‌ ఫిట్ తో పాటు ఆకట్టుకునే ఎక్స్‌ ప్రెషన్స్ వల్ల ఫొటోలకు మరింతగా బ్యూటీ చేకూరింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంత అందగత్తెను తెలుగు హీరోలు దర్శకులు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలు చూసిన తర్వాత అయినా తెలుగు మేకర్స్ ఈమెతో సినిమాను చేస్తారేమో చూడాలి.