ఎన్టీఆర్ కోసం ప్రభాస్ బ్యూటీ ప్రయత్నాలు!

Mon Sep 26 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Sahoo Beauty Shradha Kapoor

RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వెంటనే మరొక సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ దర్శకుడు కొరటాల శివ ఇంకా పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేయకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత మరో డిజాస్టర్ అందుకోవడం పక్కా అనే సెంటిమెంట్ కు బ్రేక్ చేయాలి అని ఎన్టీఆర్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.అయితే కొరటాల శివ ఇదివరకే ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకోవడం ఆ తర్వాత ఈ కాంబినేషన్ పై వివిధ రకాలుగా అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో పవర్ ఫుల్ స్క్రిప్టి సిద్ధమయ్యే వరకు షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకోవడం లేదు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే ముందుగా అనుకున్న కదను పక్కన పెట్టేసి జూనియర్ ఎన్టీఆర్ మరో కథను రెడీ చేయమని అన్నట్లుగా కూడా కథనాలు అయితే వినిపిస్తున్నాయి.

గత వారం క్రితం కూడా కొరటాల శివ మరోసారి నెరేషన్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదని సమాచారం. అయితే ఇదంతా జరుగుతుంటే ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా అవకాశం అందుకోవడం కోసం కొంతమంది అగ్ర హీరోయిన్స్ కూడా ముందస్తుగానే ఈ ప్రాజెక్టులో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా బాలీవుడ్ నుంచి కూడా కొంతమంది హీరోయిన్లు ఇప్పటికే కొరటాల శివను అలాగే ఎన్టీఆర్ టీమ్ ను కూడా సంప్రదించినట్లు టాక్ అయితే వినిపిస్తుంది.

అందులో ఇంతకుముందు ప్రభాస్ తో నటించిన హీరోయిన్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సాహో సినిమాలో నటించిన శ్రద్ధా కపూర్ కు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా రణ్ వీర్ సింగ్ లవ్ రంజాన్.

ఇక ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకు హీరోయిన్ కోసం కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుసుకున్న ఈ బ్యూటీ తన వైపు నుంచి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో నటించాలి అని అలియా భట్ కూడా అదే తరహాలో ప్రయత్నాలు చేసి అవకాశం అందుకుంది. మరి ఇలా అడిగితే ఎన్టీఆర్ కొరటాల ఒప్పుకుంటారో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.