Begin typing your search above and press return to search.

వెయిటర్ కోసం వెదుకుతున్న సచ్చిన్ ..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   16 Dec 2019 10:49 AM GMT
వెయిటర్ కోసం వెదుకుతున్న సచ్చిన్ ..ఎందుకంటే ?
X
ప్రపంచ క్రికెట్ లో సచ్చిన్ టెండూల్కర్ ఒక లెజెండ్. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే తాజాగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఓ ఆసక్తికర వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. తానొక వెయిటర్ గురించి వెతుకుతున్నాడట. అతన్ని వెతికిపెట్టాలని నెటిజన్స్‌ ను కోరాడు. తాను క్రికెట్‌ ఆడుతున్న రోజుల్లో ఆ వెయిటర్ కెరీర్‌‌‌‌ కు ఉపయోగపడే సలహా ఇచ్చా డని, అందుకే అతన్ని కలవాలనుందని సచిన్ ట్విటర్‌‌ వేదికగా ఆ వెయిటర్ ఎక్కడ ఉన్న నాకు తెలియజేయాలని కోరారు.

అసలు సచిన్ టెండూల్కర్ కు ఒక వెయిటర్ తో పని ఏంటి అంటే ? గతంలో ఓ టెస్ట్‌‌ సిరీస్ సందర్భం గా చెన్నైలోని తాజ్‌ కోరమండల్‌‌ హోటల్‌‌ సచ్చిన్ దిగాడు. టల్ రూమ్ లో ఉండగా, ఓ వెయిటర్ కాఫీ తీసుకువచ్చాడట. అందరిలాగే అతను కూడా సచిన్ మీతో క్ మాట్లాడొచ్చా? అని అడిగాడట. దానికి సచ్చిన్ చెప్పు అనగా .. సచిన్ మీరు మోచేతికి ఆర్మ్ ప్యాడ్ కట్టుకున్న ప్రతిసారి బ్యాట్ ఊపే విధానంలో స్వల్పంగా మార్పు వస్తోంది. అది మీ బ్యాటింగ్ పై ప్రభావం చూపిస్తోంది” అన్నాడట . ఆ తరువాత అతని సూచనతో ఎల్బో గార్డ్ సైజ్‌ మార్చుకొని నేను అద్భుతంగా రాణించా. ఆ వెయిటర్ సలహా నాకు బాగా ఉపయోగపడింది అని తెలిపాడు.

ప్రపంచంలో ఎవ్వరూ గుర్తించని నా సమస్యను ఆ వెయిటర్ కనుగొన్నా డు. అతన్ని ఇప్పుడు మరోసారి కలవాలనుంది. నెటిజన్స్.. కొంచెం ఆ వెయిటర్‌‌‌‌ను వెతికిపెట్టండి ’అని ఆ వీడియోలో సచిన్‌‌ విజ్ఞప్తి చేశాడు. సచిన్‌‌ విన్నపానికి తాజ్‌ హోటల్‌‌ స్పందిచింది. మాస్టర్‌‌‌‌ కు సలహా ఇచ్చిన తమ ఉద్యోగిని గుర్తించామని తెలుపుతూ సచిన్‌‌ తో అతను దిగిన ఫొటోను షేర్‌‌‌‌ చేసింది. ‘సచిన్.. మా కొలిగ్‌ తో మీకున్న చిరస్మరణీయ జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. అతన్ని మేం గుర్తించాం. మీ ఇద్దరిని కలుపబోతున్నందుకు సంతోషంగా ఉన్నాం ’ అని ట్వీట్‌ చేసింది