Begin typing your search above and press return to search.

బాహుబలిని దాటేసేలా ఉందే?

By:  Tupaki Desk   |   23 Aug 2019 2:30 PM GMT
బాహుబలిని దాటేసేలా ఉందే?
X
సాహో రికార్డుల పర్వం సైలెంట్ గా మొదలవుతోంది . ప్రభుత్వాల నుంచి ఇంకా అనుమతులు రాని నేపధ్యంలో అడ్వాన్సు బుకింగ్ మొదలుపెట్టలేదు. కనీసం రెండు వారాలు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చేలా నిర్మాతలు ఇప్పటికే అప్లికేషన్ పెట్టారు. అది గ్రాంట్ చేయడం ఆలస్యం ఆన్ లైన్ రచ్చ మొదలవుతుంది. ఇదిలా ఉండగా తమిళనాడులో సైతం సాహోకు గ్రాండ్ వెల్కం దక్కుతోంది.

బాహుబలి 2 అక్కడ 525 స్క్రీన్లలో విడుదల చేయగా సాహో కోసం 550 స్క్రీన్లు ముస్తాబయ్యాయి. చివరి నిమిషం దాకా ఇంకో యాభై దాకా యాడ్ కావొచ్చని చెన్నై రిపోర్ట్. ఇప్పటిదాకా ఏ తెలుగు హీరో సినిమా ఇంత భారీ స్థాయిలో తమిళనాడులో రిలీజైన చరిత్ర లేదు. ఆ రకంగా ప్రభాస్ మరో ఘనత సాదించినట్టే. యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప మిగిలిన కీలకమైన భాగాలన్నీ తమిళ వెర్షన్ లో ఒరిజినల్ గా తీశామని డబ్బింగ్ కింద దీన్ని పరిగణించకూడదని దర్శకుడు సుజిత్ నొక్కి చెబుతున్నాడు.

సో అక్కడివాళ్ళకు సైతం స్ట్రెయిట్ మూవీ చూస్తున్న అనుభూతి కలుగుతుందని గ్యారెంటీ ఇస్తున్నాడు. చెన్నై లాంటి కీలక నగరాల్లో తెల్లవారుఝామున 3 నుంచి 4 గంటల లోపే షోలు ప్రారంబించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఎలాగూ అదే రోజు తమిళ్ లో పెద్దగా పోటీ లేదు. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నవి కూడా యావరేజ్ టాక్ తో నడుస్తుండటంతో సాహోకి ఇవన్ని ప్లస్ గా మారుతున్నాయి. స్క్రీన్ల సంఖ్య సరే మరి వసూళ్ళలో కూడా బాహుబలి 2ని సాహో దాటుతుందో లేదో చూడాలి