Begin typing your search above and press return to search.

చెప్పనే లేదు.. అయినా వ్యూస్ కొట్లాట!

By:  Tupaki Desk   |   10 Dec 2019 5:30 PM GMT
చెప్పనే లేదు.. అయినా వ్యూస్ కొట్లాట!
X
పిచ్చి పీక్స్ లోకి పోతే ఏం చేస్తారో అర్థం కాదు. ఇప్పుడు స్టార్ హీరోలతో పాటు అభిమానులందరికీ వ్యూస్ పిచ్చి పట్టుకుంది. ఆ పిచ్చతో హీరోలు నిర్మాతల జేబులకు చిల్లు పెడుతుంటే.. నెటిజన్లు సోషల్ మీడియా వాతవరణంలో యుద్ధపూర్వక వాతావరణం ఏర్పడేలా చేస్తున్నారు. యూట్యూబ్ లో విషయంలో ఈ రచ్చ ఎప్పటి నుంచో ఉంది. ఈమధ్య ఇది డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సినిమాల వ్యూస్ కు కూడా పాకింది. ఈమధ్య అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు ఆదరణ పెరిగింది. దీంతో ఇక్కడ వచ్చే వ్యూస్ విషయంలో రచ్చ సాగుతోంది.

ఈమధ్య సోషల్ మీడియా '2019 లో అమెజాన్ లో భారీ వ్యూస్ సాధించిన చిత్రం' అనేది ట్రెండింగ్ టాపిక్ గా మారింది. కొందరేమో 'సాహో' అన్నారు. ఇంకొందరేమో 'కేజీఎఫ్: చాప్టర్ 1' అన్నారు. మరికొందరేమో 'వార్' అన్నారు.. ఇలా ఎవరికి తోచిన సినిమా పేరు వారు చెప్పుకుంటూ ఇతర సినిమాల పేరు చెప్పినవారిని తెగ తిట్టడం మొదలు పెట్టారు. ఈ లిస్టులో ఇంకా రెండు మూడు పేర్లు కూడా వచ్చి చేరాయి. అయితే ఏది నిజంగా 'అత్యధిక చూపులు' సాధించిన చిత్రం అనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి అమెజాన్ ప్రైమ్ వారు ఇలా ఫలానా ఏడాదికి హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన చిత్రం ఇది అంటూ అధికారికంగా వెల్లడించలేదు.

ఈలెక్కన చాలామంది అసలు విషయం తెలుసుకోకుండా మా ఫేవరెట్ సినిమాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయని ఇతరులతో వాదిస్తూ డిజిటల్ పప్పులో కాలేశారు. ఒకవేళ నిజంగా అమెజాన్ ప్రైమ్ వారు ఈ విషయాన్ని వెల్లడిస్తే అప్పుడు తీరిగ్గా మనం ఈ అత్యధిక చూపులపై ఫైటింగ్ చేసుకోవచ్చు.