Begin typing your search above and press return to search.

#SSMB28 లాంచింగ్ అప్ డేట్ ఇదిగో

By:  Tupaki Desk   |   9 Aug 2022 5:26 AM GMT
#SSMB28 లాంచింగ్ అప్ డేట్ ఇదిగో
X
టీమ్ #SSMB28 నుంచి అప్ డేట్ అందింది. నేడు మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ త్వ‌ర‌లోనే సినిమాని ప్రారంభిస్తున్నామ‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

''బ‌హుముఖ‌ నటనా నైపుణ్యం.. అయస్కాంత శ‌క్తి....మనోహర వ్యక్తిత్వం యువ‌ర్స్ ట్రూలీ మహేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. #SSMB28 షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది! #HBDసూపర్ స్టార్ మహేష్ బాబు'' అంటూ బ‌ర్త్ డే విషెస్ తో కొత్త పోస్ట‌ర్ ని లాంచ్ చేసారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

సహృద‌యం అంటూ చిరు ప్రశంస‌:

మ‌రోవైపు మ‌హేష్ కి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. సినీప‌రిశ్ర‌మ పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా మ‌హేష్ సామాజిక సేవా కార్య‌క్ర‌మాన‌లు ప్రశంసిస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసారు.

''ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బ‌ర్త్ డే'' అంటూ మెగాస్టార్ విషెస్ తెలిపారు.

ప‌లువురు సినీరాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు మ‌హేష్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. తేదేపా నాయ‌కులు జ‌య‌దేవ్ గల్లా.. మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు త‌దిత‌రులు విషెస్ ఎలిపారు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ అంద‌మైన న‌వ్వు గురించి ప్ర‌స్థావిస్తూ ఆయ‌న బావ‌గారు హీరో సుధీర్ బాబు విషెస్ తెలియ‌జేసారు. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కూడా సోష‌ల్ మీడియాల్లో మ‌హేష్ కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసారు.