Begin typing your search above and press return to search.

పాటలతోనే కాదు మాటలతోనూ థమన్‌ మాయ!!

By:  Tupaki Desk   |   26 Feb 2020 8:45 AM GMT
పాటలతోనే కాదు మాటలతోనూ థమన్‌ మాయ!!
X
ప్రస్తుతం టాలీవుడ్‌.. కోలీవుడ్‌ లో స్టార్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అంటే ఠక్కున వినిపించే పేర్లలో థమన్‌ పేరు ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా టాలీవుడ్‌ లో ఈయన టాప్‌ మోస్ట్‌ కంపోజర్‌ గా దుమ్ము రేపుతున్నాడు. అల వైకుంఠపురంలో పాటలు ఏ రేంజ్‌ లో సక్సెస్‌ అయ్యాయో అందరికి తెల్సిందే. ప్రస్తుతం పవన్‌ పింక్‌ రీమేక్‌ కు ట్యూన్స్‌ కడుతున్న థమన్‌ మరో వైపు తమిళంలో కూడా మరింత బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

స్టార్‌ హీరో విజయ్‌ ను కలిసిన థమన్‌ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించాడు. విజయ్‌ ఒక గొప్ప నటుడు అంటూ కితాబిచ్చాడు. అదే సమయంలో విజయ్‌ సినిమా కు వర్క్‌ చేయాలని ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక దర్శకుడు అట్లీ గురించి థమన్‌ ఆకాశానికి ఎత్తేలా మాట్లాడాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లో గొప్ప కమర్షియల్‌ దర్శకుడు అంటే అట్లీ మాత్రమే అన్నాడు. ఒక స్టార్‌ హీరోను ఆయన ఫ్యాన్స్‌ ఎలా చూడాలి అనుకుంటే అతడు అలా చూపిస్తాడని థమన్‌ చెప్పుకొచ్చాడు.

పాటలతో ప్రేక్షకులను మాయ చేసినట్లుగా థమన్‌ తన మాటలతో మాయ చేస్తూ ఆఫర్లు దక్కించుకుంటున్నాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇటీవల పవన్‌ ను కలిసిన తాను చాలా గొప్ప విషయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన థమన్‌ ఇప్పుడు విజయ్‌ అట్లీ కుమార్‌ లపై ప్రశంసలు కురిపించడం చూస్తుంటే ఇదంతా కూడా థమన్‌ మరిన్ని ఆఫర్ల కోసం వారి సినిమాల్లో ఛాన్స్‌ ల కోసం చేస్తున్నట్లుగా అనిపిస్తుందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి థమన్‌ తన మాటతో స్టార్స్‌ ను బుట్టలో పడేసుకుని వరుస చిత్రాల్లో ఛాన్స్‌లు దక్కించుకుంటున్నాడు అంటున్నారు.