ఎన్టీఆర్ పై జక్కన్న సంచలన వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో?

Tue Nov 29 2022 14:43:04 GMT+0530 (India Standard Time)

SS Rajamouli Comments on Junior NTR

నటన మరియు డాన్స్ విషయంలో ఎన్టీఆర్ ను ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ మరియు ప్రముఖ దర్శక నిర్మాతలు పొగడ్తల వర్షంలో ముంచెత్తిన విషయం తెల్సిందే. నందమూరి ఫ్యామిలీ హీరో అయిన ఎన్టీఆర్ కి బ్లెడ్ లోనే నటన ఉందని.. ఒక అద్భుతమైన నట శిఖరం మనవడు అయిన కారణంగా ఎన్టీఆర్ కూడా అద్భుతమైన నటుడిగా పేరు దక్కించుకుంటున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అభిమానులు ఇతర ఇండస్ట్రీ వర్గాల వారు ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడటం ఒక ఎత్తు అయితే టాలీవుడ్ జక్కన్న రాజమౌళి నోట ఎన్టీఆర్ నటన గురించి రావడం మరో ఎత్తు అనడంలో ఎలాంటి సందేహం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఒక యాక్టింగ్ ట్రాన్స్ ఫార్మర్ అంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఎన్టీఆర్ నటన శక్తి గురించి రాజమౌళి మాట్లాడుతూ... పుట్టుకతోనే నటుడు ఎన్టీఆర్... అతడి యొక్క గ్రాస్పింగ్ పవర్ తో పాటు ఆన్ స్క్రీన్ పై అతడి యొక్క ప్రెజెన్స్ మరియు ప్రజెంటేషన్ ఒక అసమానమైనది. అలాంటి వ్యక్తిని డైరెక్ట్ చేస్తున్నప్పుడు దర్శకుడికి చాలా గొప్పగా అనిపిస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళి వ్యాఖ్యలను నందమూరి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఇతర హీరోల ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం విమర్శిస్తూ ఉన్నారు. రాజమౌళి కి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం అలాంటిది అంటూ కొట్టి పారేస్తూ ఉన్నారు.

ఏది ఏమైనా ఎన్టీఆర్ నటన మరియు డాన్స్ విషయంలో టాప్ లో ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.