Begin typing your search above and press return to search.

ప్రతి ఏడాది ఒక హిట్ ప్రాంచైజ్.. రాజమౌళి సూపర్ సజేషన్..!

By:  Tupaki Desk   |   29 Nov 2022 4:02 AM GMT
ప్రతి ఏడాది ఒక హిట్ ప్రాంచైజ్.. రాజమౌళి సూపర్ సజేషన్..!
X
హీరో గానే కాదు నిర్మాతగా కూడా తన టాలెంట్ చూపిస్తున్నాడు నాని. అ! తో నిర్మాతగా మారిన నాని ఆ తర్వాత హిట్, మీట్ క్యూట్ సినిమాలు తీశారు ఇప్పుడు హిట్టు 2ని ప్రేక్షకులు ముందుకు తెస్తున్నారు. డిసెంబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చిన హిట్టు ఈవెంట్ ఆడియన్స్ సమక్షంలో గ్రాండ్ గా జరిగింది.

ఈవెంట్ లో మాట్లాడిన రాజమౌళి రెండు నెలల నుంచి ఇంగ్లీషులో మాట్లాడి మాట్లాడి ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే హాయిగా ఉందని అన్నారు. హిట్ ఒక సినిమాగా కాకుండా ఒక ఫ్రాంచైజిలా తయారు చేసిన నాని, ప్రశాంతి, శైలేష్ ముగ్గురికి కంగ్రాట్స్ చెప్పారు.

ఒక సినిమా హిట్ అని చేయొచ్చు కానీ దాన్ని ఫ్రాంచైజీలా చేయడం అంత ఈజీ పని కాదని అన్నారు రాజమౌళి. ఈ జోనర్ తో ఇండియాలోనే ఇదే ఫస్ట్ టైం ఇలా చేస్తున్నారని అన్నారు. సినిమా డైరెక్టర్ హీరో ప్రొడక్షన్ కంపెనీలో ఫ్రాంచైజ్ లు ఉంటుంది కానీ సినిమా టైటిల్ కి ఫ్యాన్స్ ఉండటం గొప్ప విషయం.

హిట్ సినిమా వస్తే అందులో ఏ ఫేస్ ఉన్నా సినిమా చూడాలని జనాలు ఇష్టపడుతున్నారు. అలాంటి ఫ్రాంచైజ్ ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కంగ్రాట్స్ అన్నారు రాజమౌళి. అందులో చేసిన హీరోలు విశ్వక్ సేన్, అడవి శేష్ లు కూడా చాలా ఎనర్జీ తీసుకొచ్చారు.

హిట్ 2 ట్రైలర్ చూశాక చాలా బాగా అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అన్నారు రాజమౌళి. ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనిపించింది అంత ఎక్సయిట్ కలిగించింది సినిమా మీద అసలు ఏమాత్రం డౌట్ అక్కర్లేదు కచ్చితంగా మంచి ఫలితాన్ని అందుకుంటుంది అన్నారు రాజమౌళి.

ఇక ఈ సందర్భంగా దర్శక నిర్మాతలకు రాజమౌళి ఒక సలహా ఇచ్చారు. హిట్ ఫ్రాంచైజీ గా హిట్టు 3,4 వస్తాయి కానీ ప్రతి సంవత్సరం ఇదే సీజన్లో వచ్చేలా చేయండి అని అన్నారు. ఈ సీజన్లో హిట్ వస్తుంది అనేట్టుగా ప్లాన్ చేయండి. ఒకే రోజు లేదా ఒకే వారం ప్రతి సంవత్సరం ఒక హిట్ ఫ్రాంచైజ్ వచ్చేలా చేయండి అన్నారు రాజమౌళి. సినిమాలో టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అడివి శేష్, మీనాక్షి పెయిర్ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా ఇంప్రెస్ చేసింది. తెలుగు సినిమా నుండి వస్తున్న మంచి క్వాలిటీ సినిమా ఇది హిట్టు 2 మంచి సక్సెస్ అవ్వాలని కోరారు రాజమౌళి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.