బాలు గారి కొడుకు ఆ హీరోయిన్.. ఏదో జరుగుతోంది

Sun Jun 26 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

SP Charan And Actress Sonia

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎస్పీ చరణ్ తండ్రి స్థాయిలో సక్సెస్ అవ్వలేక పోయాడు. కొన్ని వివాదాల కారణం అప్పట్లో వార్తల్లో నిలిచిన చరణ్ మళ్లీ తండ్రి తో పాటు స్టేజ్ షో ల్లో పాల్గొంటూ ఒక మంచి సింగర్ గా పేరు దక్కించుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలోనే బాలు గారి మృతితో ఆయన కెరీర్ మళ్లీ కష్టాల్లో పడ్డట్లు అయ్యింది.తండ్రి సుదీర్ఘ కాలం పాటు నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమాన్ని తన భుజాల మీదకు ఎత్తుకున్న ఎస్పీ చరణ్ ఏదో ఒక విధంగా మీడియాలో ఉంటూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈయన గురించి తమిళ మీడియాలో ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఆయన ఇన్ స్టా లో షేర్ చేసిన ఫోటోలు మరింత రచ్చ చేస్తున్నాయి.

ఇన్ స్టా గ్రామ్ లో 7/జి బృందావన్ కాలనీ సినిమా హీరోయిన్ సోనియా తో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలను చరణ్ షేర్ చేశాడు. ఆమె మీద చేయి వేసి.. ఆమె కూడా చాలా పద్దతిగా చరణ్ పక్కన నిల్చుని ఉండటంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారు.. త్వరలో పెళ్లి చేసుకుంటారు అనే ప్రచారం మొదలు అయ్యింది. తమిళ మీడియా ల్లో ఇంకాస్త డెప్త్ గానే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మీడియాలో వస్తున్న వార్తల అనుసారం గత కొంత కాలంగా వీరిద్దరూ సహజీవనం లో ఉన్నారు. చరణ్ మొదటి భార్య నుండి విడిపోయాడు.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమెతో స్నేహం.. అది కాస్త ప్రేమ గా మారడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ ఫోటోలు షేర్ చేయడంతో చరణ్ కన్ఫర్మ్ చేసినట్లు అయ్యింది.

సోనియా మరియు ఎస్పీ చరణ్ లు ప్రస్తుతం చెన్నైలో కలిసి ఉంటున్నారని... వారిద్దరు కూడా పెద్దల అంగీకారంతో వివాహానికి సిద్దం అయ్యారని తెలుస్తోంది. సోనియా కూడా గతంలో పెళ్లి చేసుకుని విడిపోయిన విషయం తెల్సిందే. వీరిద్దరు ప్రేమ మరియు పెళ్లి విషయం తమిళ మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.