Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్టర్ లవ్ ప్రపోజల్ ను తిరస్కరించిన హీరోయిన్?

By:  Tupaki Desk   |   18 Jan 2020 3:59 AM GMT
స్టార్ డైరెక్టర్ లవ్ ప్రపోజల్ ను తిరస్కరించిన హీరోయిన్?
X
స్పైడర్ సినిమాలో మహేశ్ ను తలదన్నేలా సైకో క్యారెక్టర్ లో విలనిజం పండించిన తమిళ నటుడు ఎస్.జే సూర్యకు ప్రేమ విషయంలో షాక్ తగిలినట్టు తమిళ మీడియా కోడై కూస్తోంది.. సూర్య నటుడే కాదు.. మొదట దర్శకుడు. అప్పుడెప్పుడే పవన్ కళ్యాణ్ తో ఖుషీ సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. సూర్య తమిళంలో నటించిన ఇరైవి, స్పైడర్ - మెర్సల్ చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. అటు దర్శకత్వం - ఇటు నటుడు - హీరోగానూ సూర్య తమిళనాట ఫేమస్.

ప్రస్తుతం ఎస్.జే సూర్య తమిళంలో రాధామోహన్ దర్శకత్వంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.ఈ సినిమా సాగుతున్నకొద్దీ వీరిద్దరి మధ్య పరిచయం పెరిగిపోయిందట.. ఈ క్రమంలోనే సెట్లోనే హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కు ఎస్.జే సూర్య లవ్ ప్రపొజల్ చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే సూర్య నుంచి వచ్చిన ఈ ప్రేమ ప్రతిపాదన చూసి హీరోయిన్ ప్రియా భవానీ షాక్ కు గురైందట.. వెంటనే సూర్య ప్రపొజల్ ను తిరస్కరించిందట.. దీనికి నిరాశకు గురయ్యారట సూర్య. ఈ వార్తలు ఇప్పుడు తమిళ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ లవ్ ప్రపోజల్ పై ఎట్టకేలకు నటుడు ఎస్.జే సూర్య సీరియస్ గా స్పందించారు. కొంతమంది ఇడియెట్స్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాను ప్రియా భవానీకి ఎలాంటి లవ్ ప్రపోజల్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులమని.. కలిసి నటిస్తున్నంత మాత్రానా రూమర్స్ వ్యాపింపచేస్తారా అని ట్వీట్ చేసి మండిపడ్డారు.