Begin typing your search above and press return to search.

#SDT14 ట్విస్ట్.. చారిత్ర‌క క‌థ‌లో సుప్రీం హీరో?

By:  Tupaki Desk   |   24 Jan 2021 8:50 AM GMT
#SDT14 ట్విస్ట్.. చారిత్ర‌క క‌థ‌లో సుప్రీం హీరో?
X
మ‌హ‌మ్మారీ క్రైసిస్ కొన‌సాగుతున్నా `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్` చిత్రాన్ని గ‌ట్సీగా రిలీజ్ చేసి ఫ‌ర్వాలేద‌నిపించే రిజ‌ల్ట్ అందుకున్నాడు సాయి తేజ్. సుప్రీం హీరో గ‌ట్స్ కి అంతా ప్ర‌శంసించారు. ఇలాంటి క‌ష్టంలో.. అత‌డి డేరింగ్ స్టెప్ ప‌రిశ్ర‌మ‌కు ఓ దారి చూపించింది. ఆ త‌ర్వాత సంక్రాంతి బ‌రిలో నాలుగు సినిమాలు రిలీజ‌వ్వ‌డం వెన‌క సాయి తేజ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఒక బ‌ల‌మైన రీజ‌న్‌.

తాజాగా సుప్రీంహీరో సాయి తేజ్ న‌టిస్తున్న 14వ సినిమా టైటిల్ మోష‌న్ పోస్టర్ ని జనవరి 25 న రిలీజ్ చేయ‌నున్నామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. మేకర్స్ తాజాగా ఈ ప్ర‌క‌ట‌న‌తో ఒక కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్ట‌ర్ అంతా మ‌ర్మంగా క‌నిపిస్తోంది. కార్ట్ లాంటి ర‌థాన్ని లాగుతున్న కీలుగుర్రాల క‌థేమిటో గానీ ఉత్కంఠ‌ను పెంచింది. కుంకుమ పువ్వు రంగు.. తెల్ల జెండాలతో కూడిన రథం ఇందులో క‌నిపిస్తోంది. టైటిల్ ఏమిటో గెస్ చేయాల్సిందిగా ఈ ప్రీపోస్ట‌ర్ హింట్ ఇస్తోంది.

ప్ర‌స్థానం ఫేం దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పొలిటికల్ డ్రామా అని ఇప్ప‌టికే పుకార్లు ఉన్నాయి. కానీ ఈ కాన్సెప్ట్ పోస్టర్ చారిత్రాత్మక క‌థ‌తో తెర‌కెక్కుతోంద‌‌న్న‌ హింట్ ని ఇచ్చింది. ఐశ్వర్య రాజేష్ క‌థానాయిక‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు- రమ్య కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సాయి తేజ్ కంబ్యాక్ అయ్యాక న‌టించిన ఈ సినిమా దేవ‌క‌ట్టాకి చక్క‌ని రీరూట్ వేస్తుందేమో చూడాలి.