Begin typing your search above and press return to search.

రూపాయి వాల్యూ.. ఢా!! డాల‌ర్‌కు 80!!

By:  Tupaki Desk   |   28 Jun 2022 3:30 PM GMT
రూపాయి వాల్యూ.. ఢా!! డాల‌ర్‌కు 80!!
X
దేశీయ కరెన్సీపై ఒత్తిడి కొనసాగనుందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. సమీప భవిష్యత్‌లో డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.79-80 స్థాయిలో స్థిరపడవచ్చని వారు అంచనా వేశారు. ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, ముడి చమురు తదితర కమోడిటీల ధరలింకా గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతుండటం ఇందుకు కారణమని  పేర్కొన్నారు.  పైగా, రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐకి అంతగా వెసులుబాటు లేకుండా పోయిందన్నారు.

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఫలితంగా ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ముడి చమురు ధరలు దశాబ్దాల గరిష్ఠానికి ఎగబాకాయి. ఇందుకుతోడు, మన ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు క్రమంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటుడటం కూడా మన కరెన్సీపై ఒత్తిడి పెంచింది. తత్ఫలితంగా ఈ ఏడాదిలో రూపాయి విలువ 5 శాతానికి పైగా పతనమైంది. కాగా సోమవారం రూపాయి విలువ మరో 4 పైసలు తగ్గి రూ.78.37కు చేరుకుంది.

మ‌రోవైపు.. ద్రవ్యోల్బణ భయాలు తగ్గుముఖంపట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలూ లాభాల్లో దూసుకెళ్లాయి. వరుసగా మూడో రోజూ ఎగబాకిన సెన్సెక్స్‌, నిఫ్టీ.. 2 వారాలకు పైగా గరిష్ఠ (ఈ నెల 10 నాటి) స్థాయికి చేరాయి.  ట్రేడింగ్‌ ముగిసేసరికి, సెన్సెక్స్‌ 433.30 పాయింట్ల (0.82 శాతం) లాభంతో 53,161.28 వద్ద స్థిరపడింది. ఒక దశలో సూచీ 782 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ 132.80 పాయింట్లు (0.85 శాతం) బలపడి 15,832.05 వద్దకు చేరుకుంది.

గడిచిన మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,378 పాయింట్లు (2.56ు), నిఫ్టీ 418 పాయింట్లు (2.73ు) పుంజుకున్నాయి. మాంద్యం భయాలతో అంతర్జాతీయంగా ముడి చమురుతో పాటు ఇతర కమోడిటీ ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ద్రవ్యోల్బణం త్వరగానే అదుపులోకి రావచ్చన్న విశ్లేషణలు మార్కెట్లను మళ్లీ లాభాల్లో నడిపిస్తున్నాయని బ్రోకింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి.