రియా స్టేట్మెంట్: ఆ హీరోయిన్ ఐస్ క్రీమ్ లో గంజాయి కలుపుకుని తినేది..!

Thu Jun 10 2021 16:00:01 GMT+0530 (IST)

Rumors on Reha and Sara Ali khan

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ ఆరోపణలతో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఈ కేసులో అరెస్ట్ అయిన విషయం విదితమే. దాదాపు నెల రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత రియా బెయిల్ పై విడుదలైంది. ఈ కేసులో ఇటీవల సుశాంత్ ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పిథానిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసుపై మళ్ళీ ఫోకస్ పెట్టిన కొన్ని జాతీయ న్యూస్ ఛానల్స్.. ఎన్సీబీ కి రియా రాతపూర్వక స్టేట్మెంట్ ఇచ్చిందని.. అందులో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ గురించి సంచలనాత్మక విషయాలు వెల్లడించిందని పేర్కొన్నాయి.జీ న్యూస్ నివేదిక ప్రకారం సారా అలీఖాన్ తనకు గంజాయి మరియు వోడ్కాను అందించినట్లు రియా అంగీకరించిందట. కొన్నేళ్లుగా స్నేహితులైన రియా - సారా ల మధ్య 2017 జూన్ 4 నుంచి జూన్ 6 వరకు జరిగిన చాట్ లలో డ్రగ్స్ గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పెయిన్ రిలీఫ్ కోసం సారా అలీఖాన్ ఐస్ క్రీమ్ లో గంజాయి కలిపి తీసుకునేదని రియా తన స్టేట్మెంట్ లో తెలిపిందట. అంతేకాదు ఆమె గంజాయి ని చుట్టి సిగరెట్ మాదిరి తీసుకునేదని.. అది తనకు కూడా అలవాటు చేసిందని రియా చక్రవర్తి ఎన్సీబీ దర్యాప్తులో వెల్లడించిందని సదరు న్యూస్ ఛానల్ లో పేర్కొన్నారు.