ఎమీ జాక్సన్ కొత్త డేటింగ్ పై ఆగని రూమర్లు

Fri Jul 01 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

Rumors abound on Amy Jackson new dating

అందాల ఎమీ జాక్సన్ బ్రిటన్ కి చెందిన బిలియనీర్ జార్జి పనాయటౌని పెళ్లాడి ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇటీవల ఈ జంటకు బ్రేకప్ అయ్యిందన్న గుసగుసా వినిపిస్తోంది. అంతేకాదు గాసిప్ గర్ల్ స్టార్ ఎడ్ వెస్ట్ విక్ తో ఎమీజాక్సన్ గత కొంతకాలంగా డేటింగ్ చేస్తోందని కథనాలొస్తున్నాయి. ఇటీవలే వెస్ట్ విక్ పుట్టినరోజు వేళ ఇద్దరూ అతని కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.ఎడ్ విక్ 35వ పుట్టినరోజు వేడుకల్లో ఎమీజాక్సన్ అతడికి ఎంతో సన్నిహితంగా కనిపించింది. ఈ వీడియోలో ఎడ్ తన పుట్టినరోజు కేక్ ను కట్ చేస్తున్నప్పుడు అమీ అతనితో పాటు నిలబడి కనిపించింది.  తన ప్రియమైన వారితో కలిసి వేడుకలో ఎడ్ విక్ నవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఎడ్ విక్ తన బర్త్ డే కేక్ కట్ చేసి కొవ్వొత్తులను ఊదుతూ ఈ వీడియోలో కనిపించాడు.

ఎడ్- ఎమీజాక్సన్ జంట ఇటీవల రాయల్ అస్కాట్- 2022కి హాజరయ్యారు. ఈ సంవత్సరం ప్రారంభంలో స్పెయిన్ లో విహారయాత్రలో కూడా కనిపించారు. గత డిసెంబర్ లో సౌదీ అరేబియాలోని రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మొదటిసారిగా ఒకరినొకరు కలుసుకున్నారు.

తక్షణమే ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం ఆ ఇద్దరి అనుబంధంపైనా మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఆ ఇద్దరి నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఎమీ జాక్సన్ చివరిగా 2.0 చిత్రంలో కనిపించింది. ఇందులో రజనీకాంత్ - అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఎమీ  ప్రస్తుతం యునైటెడ్ కింగ్ డమ్ లో నివాసం ఉంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో .. తన కొడుకు ఆండ్రియాస్ కొంచెం పెద్దయ్యాక తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటున్నానని .. భారతదేశంలో షూటింగ్ లను మిస్సవుతున్నానని కూడా పేర్కొంది.