Begin typing your search above and press return to search.

మళ్ళీ వార్తల్లోకి వచ్చిన యువ హీరో పెళ్లి...!

By:  Tupaki Desk   |   18 Sep 2020 4:33 PM GMT
మళ్ళీ వార్తల్లోకి వచ్చిన యువ హీరో పెళ్లి...!
X
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ హీరోలంతా ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్తూ వస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఈ సమయాన్ని తమ జీవితంలోని ముఖ్యమైన సందర్భానికి కేటాయిస్తున్నారు. ఇప్పటికే నిఖిల్ - నితిన్ - రానా పెళ్లి చేసుకొని ఓ ఇంటివారయ్యారు. ఈ క్రమంలో మరో యువ హీరో ఇంట్లో పెళ్లి బాజాలు మోగించేందుకు రెడీ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ఇద్దరు తనయుల్లో ఒకరికి ఇప్పటికే పెళ్లి చేశారు. అదే సమయంలో అతని చిన్న కుమారుడి పెళ్లి కూడా చేస్తున్నట్లు ప్రకటించారు. బడా పారిశ్రామిక వేత్త మనవరాలుతో ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా చేశారు. కొన్ని రోజుల్లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకుంటుండగా ఆ యువ హీరో పెళ్లి రద్దు అయ్యిందన్న వార్త సంచలనం రేపింది. దానికి కారణాలేంటనేది అధికారికంగా తెలియనప్పటికీ.. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతోనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి యువ హీరో పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది.

అయితే కొన్నాళ్ల తర్వాత తమ రిలేటివ్స్ అయిన హీరో కూతురుతో ఈ యంగ్ హీరో పెళ్లి జరగనుందంటూ పెద్ద ఎత్తున రూమర్ స్ప్రెడ్ అయింది. అన్ని ప్రసార మధ్యమాలలో వెబ్ సైట్లలో ఈ న్యూస్ హల్ చల్ చేసింది. అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనని.. రెండు కుటుంబాల మధ్య పెళ్లి గురించి ఎటువంటి చర్చలు జరుగలేదని... బయట వినిపిస్తున్నదంతా ట్రాష్ అంటూ కొట్టిపారేశారు. దీంతో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న యువ హీరో పెళ్లి వార్త మళ్ళీ హాట్ టాపిక్ అయింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురితో హీరో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారని.. ఈ మ్యాచ్ కుదరడం వెనుక ఆ యువ హీరో వదిన హస్తం ఉందని.. ఆమెనే ఫ్యామిలీ మెంబెర్స్ ని ఒప్పించి మరిది పెళ్లి బాధ్యత భుజాలపై వేసుకుందని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టి వరుస సినిమాలు చేస్తున్న ఆ యువ హీరో పెళ్లి వార్తలు నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.