Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : హిట్ కొట్టిన బ్యూటీ అందంతో చంపేస్తోంది

By:  Tupaki Desk   |   17 May 2022 11:30 PM GMT
పిక్‌ టాక్ : హిట్ కొట్టిన బ్యూటీ అందంతో చంపేస్తోంది
X
తెలుగు సినిమా పరిశ్రమలో ఆకతాయి అనే సినిమా తో అడుగు పెట్టిన రుక్సార్ ధిల్లాన్ మెల్ల మెల్లగా తన అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు తెలుగు లో ఈ అమ్మడు నాలుగు సినిమాల్లో నటించింది. మొదటి మూడు సినిమాలు ఆకతాయి.. కృష్ణార్జున యుద్ధం... ఏబీసీడీ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఆ సినిమాలు ఈమెకు గుర్తింపును తెచ్చి పెట్టడంలో విఫలం అయ్యాయి. కాని తాజాగా వచ్చిన సినిమా మాత్రం సక్సెస్ కట్టబెట్టింది.

విశ్వక్ సేన్ హీరోగా రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా రుక్సార్ ధిల్లాన్ నటించింది. విశ్వక్ సేన్ కాస్త అగ్రసివ్ గా సినిమాను ప్రమోట్‌ చేయడంతో పాటు కొన్ని వివాదాల వల్ల సినిమా వార్తల్లో నిలిచింది. సినిమా విడుదల తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మంచి వసూళ్లు కూడా నమోదు అయ్యాయి.

రుక్సార్ ధిల్లాన్ కు మొదటి కమర్షియల్ సక్సెస్ గా అశోక వనంలో అర్జున కళ్యాణం నిలిచింది. ఆ సినిమాలో ఈ అమ్మడి లుక్ చాలా కూల్ గా ఉంటుంది. సాంప్రదాయ పద్దతిలో ఆమె కనిపించింది. దాంతో హీరోయిన్ గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు. దాంతో ఈ అమ్మడికి రాబోయే రోజుల్లో మంచి ఆఫర్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

కేవలం చీర కట్టు.. పద్దతైన లుక్ లోనే కాకుండా రుక్సార్ ధిల్లాన్ స్కిన్‌ షో చేస్తే చూపరులు మతులు పోవడం ఖాయం అని ఈ ఫోటోతో రుక్సార్ ధిల్లాన్ చెప్పకనే చెబుతోంది. చీర కట్టులో అందంగా కనిపించిన వారు కొద్ది మంది మోడ్రన్‌ డ్రస్‌ ల్లో స్కిన్ షో చేసే డ్రస్ ల్లో పెద్దగా ఆకట్టుకున్న దాఖలాలు ఉండవు. రుక్సార్ ధిల్లాన్ మాత్రం స్కిన్ షో చేసినా కూడా అందగత్తె అనిపించుకుంటుంది.

మొదటి కమర్షియల్‌ హిట్‌ దక్కించుకున్న రుక్సార్ ధిల్లాన్ తన అందంతో సోషల్‌ మీడియా ద్వారా ఇండస్ట్రీ వర్గాల వారికి ఒక మెసేజ్ ఇచ్చినట్లుగా ఈ ఫోటో ఉంది. ఇక సాదారణ కుర్రకారును ఈ నిలువుటందం చంపేస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆ థైస్ ను చూస్తే మతులు పోతున్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.