ఈ గ్లామరస్ మోసగత్తె.. ఇంస్టాను హీటెక్కిస్తోందిగా..!

Sun Mar 07 2021 08:00:01 GMT+0530 (IST)

Ruhi Singh Latest Photo

బాలీవుడ్ హీరోయిన్లకు సినిమాలలో ఎలాంటి రోల్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అలాగే డేర్ బోల్డ్ పదాలకు వారు సూటబుల్ అనిపిస్తారు. అలాంటి బోల్డ్ బ్యూటీ రూహి సింగ్. ఈ భామ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఎందుకంటే రూహి ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో నటించలేదు. కానీ సోషల్ మీడియా యూజర్స్ మాత్రం రూహిని ఇట్టే గుర్తుపడతారు. ఎందుకంటే అమ్మడి గ్లామర్ షో అంతా ఉండేది అక్కడే కదా.. మూడుపదుల వయసు దగ్గరపడుతున్న ఈ రాజస్థాని కుర్రది.. బాలీవుడ్ తెరపై 'క్యాలెండర్ గర్ల్స్' అనే సినిమాతో అడుగుపెట్టింది. యవ్వనంలోనే మోడలింగ్ వైపు అడుగులేసిన రూహి.. 2011 ఫెమినా మిస్ ఇండియా పోటీలలో రన్నరప్ గా నిలిచింది. అలాగే 2012లో 'ది వరల్డ్ బిఫోర్ హర్' అనే ఇంగ్లీష్ డాకుమెంటరీతో యాక్టింగ్ ప్రారంభించింది రూహి.2014లో మోస్ట్ డిసైరాబుల్ ఇండియన్ ఉమెన్స్ జాబితాలో కూడా స్థానం దక్కించుకుంది. అయితే క్యాలెండర్ గర్ల్స్ పలు సినిమాలలో మెరిసింది కానీ కావాల్సిన క్రేజ్ రాలేదు. అలాగే సక్సెస్ కూడా దక్కలేదు. అందుకే బాలీవుడ్ తో పాటు తెలుగు తమిళం వైపు కూడా దృష్టిపెడుతోంది. 2017లో బొంగు అనే మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది రూహి. త్వరలో మోసగాళ్లు అనే సినిమాతో తెలుగులో కూడా కాలుపెట్టనుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో రూహికి ఎంతటి ఫాలోయింగ్ ఉందో బయటివాళ్లకు తెలియదు. కానీ ఈ సుందరి చేసే సోయగాల ప్రదర్శనకోసం ఫ్యాన్స్ ఎల్లప్పుడూ కళ్ళప్పగించి రెడీగా ఉంటారు. ముఖ్యంగా రూహి ఇంస్టాగ్రామ్ లో రెచ్చిపోతుంది. అందుకే తాజాగా ఓ గ్లామరస్ పిక్ షేర్ చేసింది. స్టైలిష్ టాప్ అండ్ బాటమ్ కాస్ట్యూమ్స్ తో తన హైట్ కూడా బయటపెట్టింది. ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అంటూ చెప్పకనే చెప్పేసింది. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.