Begin typing your search above and press return to search.

హైవేపై హాట్ వాక్..కుర్రాకారు షాక్!

By:  Tupaki Desk   |   15 May 2022 9:42 AM GMT
హైవేపై హాట్ వాక్..కుర్రాకారు షాక్!
X
చిల‌సౌ` సినిమాతో తెరంగేట్రం చేసిన సిమ్లా బ్యూటీ రుహాని శ‌ర్మ సుప‌ర‌చితురాలే. తొలి సినిమాతోనే స‌క్సెస్ ఖాతాల వేసుకుంది. త్రివిక్ర‌మ్ లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు రిలీజ్ కి ముందే అందుకుంది. రిలీజ్ త‌ర్వాత అంద‌రి నోట పాజిట‌వ్ వైబ్ తో స‌క్సెస్ గాళ్ల గా నిరూపించుకుంది. అదే ఊపులో `హిట్`..`డ‌ర్టీ హ‌రి` చిత్రాల్లో బ్యాక్ టూ బ్యాక్ అవ‌కాశాలు అందుకుంది. `హిట్` మంచి విజ‌యం సాధించింది. కానీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన బోల్డ్ అటెంప్ట్ `డ‌ర్టీ హ‌రి` మాత్రం వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.

ఈసినిమాతో రుహాని త‌న‌లో సెకెండ్ యాంగిల్ ని ప‌రిచయం చేసింది. బోల్డ్ పెర్పార్మెన్స్ తో విమ‌ర్శ‌ల‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. కానీ సినిమా వైఫ‌ల్యం తో ఆ శ్ర‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది. ఆ త‌ర్వాత `నూటొక్క జిల్లాల అంద‌గాడు` లో ఛాన్స్ వ‌చ్చింది. కానీ ఆ సినిమా ఫ‌లితం అమ్మడిని వెన‌క్కి లాగిపెట్టింది. ప్ర‌స్తుతం `మీట్ క్యూట్` అనే సినిమాలో న‌టిస్తోంది.

ఇక అమ్మ‌డు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్ప‌డిక‌ప్పుడు అప్ డేట్ అవుతూ టెంప్టింగ్ ట్రీట్ ఇస్తుంటుంది. కుర్రా కారునని బుట్ట‌లో వేయ‌గ‌ల చాక‌చ‌క్యం తెలిసిన గాళ్. ఇటీవ‌లే పూల్ సైడ్ ఫోజుల‌తో మంటులు రేపిన బ్యూటీ ఈసారి ఏకంగా నేష‌న‌ల్ హైవేపై ట్రాపిక్ నే జామ్ చేసింది. అవును అమ్మ‌డి తాజా ఫోటో చూస్తే స్ట‌న్ అవ్వాల్సిందే.

రుహాని శ‌ర్మ హైవే టోల్ ప్లాజ్ల‌ వ‌ద్ద వాక్ చేసుకుంటూ వ‌స్తోన్న ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. బ్లాక్ అండ్ బ్లాక్ లో రుహానీ క్లేవేజ్ అందాల‌తో మ‌త్తెక్కిస్తుంది. ఈఫోటో రుహాని త‌న ఇన్ స్టా ఖాత ద్వారా అభిమానుల‌కు షేర్ చేసింది. దీంతో అభిమానుల కామెంట్లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఓ అభిమాని రుహాని ని చూసి టోల్ ప్లాజా ఛార్జ్ చెల్లించ‌కుండానే మినిహాయింపు ఇచ్చేస్తారంటూ కామెంట్ పోస్ట్ చేసాడు.

ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. న‌టిగా టార్గెట్ ఫిక్స్ చేసుకుని మూవ్ అవుతుంది. ఇటీవ‌లే సెకెండ్ ఇన్నింగ్స్ ని పెళ్లికి ముందే ప్రారంభించ‌డానికి రెడీ అనేసింది. హీరోయిన్ గానే కాదు...నెగిటివ్ రోల్స్ వ‌చ్చినా చేయ‌డానికి సిద్దంగా ఉన్నాను అన్న సంకేతాలు పంపేసింది. పాత్ర న‌చ్చితే ఎలా న‌టించ‌డానికైనా సిద్ధం అనేసింది.

అలాంటి అవ‌కాశాలో కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రీ ఈ భామ‌ని ప్రోత్స‌హించే ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు ఎంత మంది ఉంటారో. ఇక రుహానీ శ‌ర్మ బాలీవుడ్ పైనా కాన్సంట్రేట్ చేసింది. హిందీలో `ఆగ్ర` సినిమాతో లాంచ్ అవుతోంది. ఈ సినిమా హిట్ అయితే అక్క‌డ బిజీ అవుతుంద‌ని ధీమా క‌నిపిస్తుంది.