Begin typing your search above and press return to search.

వెబ్‌ సిరీస్‌ కోసం రూ.90 కోట్ల పారితోషికం

By:  Tupaki Desk   |   22 Nov 2020 12:54 PM GMT
వెబ్‌ సిరీస్‌ కోసం రూ.90 కోట్ల పారితోషికం
X
ఇండియాలో ఓటీటీ మార్కెట్‌ పెరగడంకు కాస్త సమయం పడుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఓటీటీ బిజినెస్‌ అనూహ్యంగా పెరిగింది. రికార్డు స్థాయిలో ఓటీటీ బిజినెస్‌ జరుగుతోంది. దాంతో వందల కోట్లు పెట్టి వెబ్‌ సిరీస్ లను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం హృతిక్‌ రోషన్‌ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ దాదాపు 250 కోట్ల తో భారీ యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ ను నిర్మించేందుకు సిద్దం అయ్యిందట.

వెబ్‌ సిరీస్‌ ను 6 ఎపిసోడ్‌ లుగా చిత్రీకరించబోతున్నారట. ఆ ఆరు ఎపిసోడ్‌ లు కూడా అద్బుతమైన యాక్షన్‌ సీన్స్‌ ను కలిగి ఉంటాయని అంటున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ లో నటించేందుకు గాను హృతిక్‌ రోషన్‌ ఏకంగా రూ.90 కోట్ల పారితోషికంను అందుకోబోతున్నాడట. ఇండియన్‌ స్టార్‌ ఒక వెబ్‌ సిరీస్‌ కోసం ఇంత భారీ స్థాయి పారితోషికం అందుకోవడం ఇదే ప్రథమం. రాబోయే నాలుగు అయిదు ఏళ్ల వరకు కూడా ఇదే అత్యధికంగా ఉండే అవకాశం ఉందని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. సాదారణంగా సినిమాకు ఈ స్థాయి పారితోషికం అదుకోవడంలో అతిశయోక్తి లేదు. కాని వెబ్‌ సిరీస్‌ కు మరీ ఇంత పారితోషికం ఏంట్రా బాబోయ్‌ అంటూ నెటిజన్స్‌ ముక్కున వేలేసుకుంటున్నారు.